Mahesh Babu And Namrata: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి చాలా మంచి క్రేజ్ ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమాతో ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంలో ఉన్నాడు. సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తన క్యారెక్టర్జేషన్స్ లో కూడా వేరియేషన్స్ ను చూపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు. తన దగ్గరికి వచ్చిన దర్శకులు కమర్షియల్ సినిమాలతోనే రావడం వల్ల ఆయన చాలావరకు అవే సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇక ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ‘వారణాసి’ సినిమాలో 5 గెటపుల్లో కనిపిస్తున్నాడు. కాబట్టి ఇందులో పూర్తిస్థాయి వేరియేషన్స్ ను చూపించి ప్రేక్షకులను అలరించాలని చూస్తున్నాడు… మహేష్ బాబు నమ్రత ఇద్దరు కలిసి వంశీ సినిమా చేశారు.
ఆ సమయంలోనే వాళ్ల మధ్య స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. మొత్తానికైతే వీళ్ళిద్దరు అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారనే చెప్పాలి… వాళ్ళు కలిసి చూసిన మొదటి సినిమా ఏంటి అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి.
నిజానికి వీళ్ళిద్దరు కలిసి చూసిన మొదటి సినిమా ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమానట…జనాల మధ్యలో సినిమాని చూస్తూ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశ్యంతో వీళ్ళు ముఖానికి మాస్కులు వేసుకొని థియేటర్ కి వెళ్లి మరి సినిమా చూసి ఎంజాయ్ చేశారట. ఇక ఏది ఏమైనా కూడా ఈ విషయాన్ని గతంలో మహేష్ బాబు ఒకసారి వెల్లడించాడు.
కానీ ఆ సినిమా పేరు ఏంటి అనేది చెప్పలేదు మొత్తానికైతే ఇప్పుడు అందుతున్న సంవత్సరం ప్రకారం ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమాని వీళ్ళిద్దరు కలిసి చూశారట. వర్షం మూవీ లవ్ స్టోరీ కావడంతో మొదటిసారి థియేటర్ కి వెళ్లి క్రౌడ్ మధ్యలో సినిమా చూసి ఎంజాయ్ చేయాలనుకున్నారట…