Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు మహేష్ బాబు (Mahesh Babu) కెరియర్ మొదట్లో అడపా దడపా సక్సెస్ లను సాధిస్తూ వచ్చిన ఆయన ఒక్కడు, అతడు, పోకిరి లాంటి సినిమాలతో భారీ విజయాలను సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు…ఇక కెరియర్ స్టార్టింగ్ లో ఆయన చేసిన ఒక సినిమా అంటే అతనితోపాటు ఆయన అభిమానులకు కూడా పెద్దగా నచ్చదట. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే వైవిఎస్ చౌదరి (YVS Choudary) దర్శకత్వంలో వచ్చిన యువరాజు(Yuvaraju) అనే సినిమా… మహేష్ బాబు ఈ మూవీలో ఒక పిల్లాడి తండ్రిగా కనిపిస్తాడు.
అప్పుడప్పుడే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు అంత పెద్ద క్యారెక్టర్ ను ఎందుకు చేశాడా? అంటూ అతని అభిమానులతో పాటు ఆయన కూడా చాలా సందర్భాల్లో ఫీలయ్యారట. మొత్తానికైతే కెరియర్ స్టార్టింగ్ లో ఒక మంచి సక్సెస్ రావడానికి వైవిఎస్ చౌదరి లాంటి దర్శకుడు అతనికి హెల్ప్ అవుతారనే ఉద్దేశ్యంతోనే ఆ సినిమా చేశాడు కానీ ఆ సినిమా తేడా కొట్టింది. ఇక అప్పట్నుంచి ఇప్పటివరకు మహేష్ బాబు మరోసారి ఒక పిల్లాడి తండ్రిగా నటించే పాత్రనైతే ఎంచుకోలేదు.
Also Read : మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం..హుటాహుటిన ముంబై వెళ్లిన నమ్రత!
ఎందుకంటే అలాంటి పాత్రలో తనని ఎవ్వరు చూడరు అనే విషయం ఆయనకు క్లారిటీగా తెలుసు…అందువల్లే ఇప్పటివరకు అలాంటి పాత్ర అయితే చేయలేదు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకుంటారా?
లేదా అనే విషయాలను కూడా తెలుసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ప్రస్తుతం రాజమౌళి రెండో షెడ్యూల్ ని స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ షెడ్యూల్లో మహేష్ బాబు సైతం పాల్గొనే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతుంది. పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహేష్ బాబు ఒక్కసారిగా ప్రపంచ స్థాయి హీరోగా మారబోతున్నాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.
Also Read: ‘సింగిల్’ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఆ 2 ప్రాంతాల్లో ‘హిట్ 3’ అవుట్!