Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు (Mahesh Babu)…ప్రస్తుతం ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కెరియర్ మొదట్లో చేసిన రాజకుమారుడు, మురారి, అతడు లాంటి సినిమాలు అతనికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఇక ఒక్కడు, పోకిరి, దూకుడు లాంటి సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్స్ గా నిలవడమే కాకుండా మహేష్ బాబు క్రేజ్ ను తారా స్థాయికి తీసుకెళ్లాయి.
Also Read : మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం..హుటాహుటిన ముంబై వెళ్లిన నమ్రత!
తెలుగులో మహేష్ బాబు కి చాలామంది వీరాభిమానులు ఉన్నారు… ప్రస్తుతం ఆయన రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసమే తను విపరీతంగా కష్టపడుతున్నాడు. ఇక మొదటి షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా యూనిట్ తొందరలోనే రెండో షెడ్యూల్ ని కూడా స్టార్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. రాజమౌళి లాంటి దిగ్గిజ దర్శకుడి నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆ మూవీ మీద ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుందా? అలాగే అటు రాజమౌళి కి, ఇటు మహేష్ బాబు ఇద్దరికి భారీ సక్సెస్ లను కట్టబెడుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్న స్టార్ హీరోలందరిలో మహేష్ బాబు కూడా ఒకరుని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక పాన్ ఇండియా హీరోగా సక్సెస్ ని సాధిస్తే మాత్రం ఆయనకి వరల్డ్ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా అవకాశాలు వచ్చే ఛాన్స్ లైతే ఉన్నాయి. మరి దానికోసమే మహేష్ బాబు తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నాడు. రాజమౌళి సినిమా అంటే అంత ఆషామాషీ వ్యవహారం అయితే కాదు. ఆ సినిమా కోసం అహర్నిశలు కష్టపడాల్సిన అవసరమైతే ఉంటుంది.
ఆయన ఏమాత్రం డూపులను పెట్టడానికి ఎంకరేజ్ అయితే చేయడు. వీలైనంతవరకు హీరోతోనే చేయించి ఆ తర్వాత డూప్ కి వెళ్లి వాళ్ళతో నటింపచేస్తాడు… ఇక మహేష్ బాబు గతంలో ఒక సినిమా అయితే చేశాడు. ఆ దర్శకుడు కథ చెప్పినప్పుడే అతనికి ఆ కథ అయితే నచ్చలేదట.
అయినప్పటికి మహేష్ బాబుకి ఉన్న మొహమాటం వల్ల ఆ సినిమా చేయలేనని చెప్పలేకపోయాడు. దానివల్ల ఆయన భారీ డిజాస్టర్ ని మూట గట్టుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) దర్శకత్వంలో తెరకెక్కిన బ్రహ్మోత్సవం (Bramhothvam) సినిమా…
మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) కాంబినేషన్లో అంతకుముందు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టువ (Seethamma Vakitlo Sirimalle Chettu) అనే సినిమా వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. దానివల్లే ఆ కాంబోలో మరోసారి బ్రహ్మోత్సవం అనే సినిమా చేశారు. ఈ సినిమా డిజాస్టర్ గా మారడమే కాకుండా శ్రీకాంత్ అడ్డాల మహేష్ బాబు క్రేజ్ లను కూడా విపరీతంగా తగ్గించిందనే చెప్పాలి.
Also Read: ‘సింగిల్’ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఆ 2 ప్రాంతాల్లో ‘హిట్ 3’ అవుట్!