Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు భారీ విజయాలను సాధిస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్న ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరిలాంటి క్రమంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని తన వైపు తిప్పుకుంటూ మంచి విజయాలను దక్కించుకోవడమే కాకుండా నెంబర్ వన్ స్టార్ హీరోలుగా ఎదగడానికి ప్రతి ఒక్క హీరో తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు… ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన మేనియా ను చూపిస్తూ వరుసగా ఆరు సంవత్సరాల్లో 6 ఇండస్ట్రీ హిట్స్ ను దక్కించుకున్నారు. కానీ ఇప్పుడు ఒక హీరో ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టడానికే నాన్న తంటాలు పడుతున్నారు. అందువల్లే తెలుగులో గాని, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గాని ఇప్పుడు నెంబర్ వన్ హీరో ఎవరు అనే దానిమీద పలు రకాల ఆసక్తికరమైన చర్చలైతే నడుస్తున్నాయి. ఒకరకంగా బాలీవుడ్ ఇండస్ట్రీని పక్కన పెట్టేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో మన హీరోలు నెంబర్ వన్ పొజిషన్ దక్కించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కొత్తదనాన్ని చూపిస్తూ మంచి సినిమాలు చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ హీరో సైతం ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. చిరంజీవి హీరోగా మహేష్ బాబు భార్య అయిన నమ్రత శిరోడ్కర్ (Namratha Shirodkar) హీరోయిన్గా ఒక సినిమా అయితే వచ్చింది. ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించినప్పటికి విమర్శకుల ప్రశంసలను అయితే అందుకుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే అంజి (Anji)…
Also Read : మహేష్ బాబు చేసిన సినిమాల్లో ఆయనతోపాటు ఫ్యాన్స్ కి కూడా నచ్చని సినిమా ఏంటంటే..?
కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్ గా అంత పెద్దగా సక్సెస్ కాకపోయిన కూడా దర్శకుడిగా కోడి రామకృష్ణ కి ఒక మంచి గుర్తింపును తీసుకొచ్చింది. అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలోనే నమ్రత మహేష్ బాబు ని ప్రేమిస్తున్న విషయాన్ని చిరంజీవితో చెప్పిందట.
అప్పటికే మహేష్ నమ్రత లు కలిసి వంశీ సినిమా చేశారు. అయితే నమ్రత ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలో తెలియక చిరంజీవి తో చెప్పిందట. ఇక ఆ విషయాన్ని చిరంజీవి సైతం కృష్ణ గారికి చెప్పి వాళ్ళ పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశారనే వార్తలు కూడా వచ్చాయి. అయినప్పటికీ అప్పట్లో కృష్ణ గారు ఒప్పుకోకపోవడంతో మహేష్ బాబు నమ్రత ఇద్దరూ కలిసి బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నారు.
ఆ తర్వాత మళ్లీ కృష్ణ గారు వాళ్ళని ఆహ్వానించి రిస్పెషన్ ఏర్పాటు చేయించాడు. మొత్తానికైతే మహేష్ బాబు నమ్రత శిరోడ్కర్ పెళ్లి జరగడానికి చిరంజీవి కూడా ఒక ముఖ్య కారణం అనే విషయాన్ని ఒకనొక సందర్భంలో నమ్రత తెలియజేయడం విశేషం…