Sankranthiki Vastunnaam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి మంచి గుర్తింపైతే ఉంది. వాళ్ళు చేసే సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా పండగ సీజన్లు మొత్తం కమర్షియల్ డైరెక్టర్లే కబ్జా చేస్తున్నారనే విషయం మనకు తెలిసిందే. ఇక సక్సెస్ లు కూడా వాళ్లే సాధిస్తూ ఉండడం విశేషం…ఇక అనిల్ రావిపూడి (Anil Ravipudi) లాంటి దర్శకుడు ఈ సంక్రాంతికి వెంకటేష్ తో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnaam) సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో సినిమా యూనిట్ సక్సెస్ మీట్ పెట్టిన విషయం మనకు తెలిసిందే…ఇక దాంతో పాటుగా నిన్న వీళ్లు కండక్ట్ చేసిన సక్సెస్ పార్టీకి సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) అలాగే తన భార్య నమ్రత (Namratha) కూడా అటెండ్ అయ్యారు. మరి ఏది ఏమైనా కూడా పెద్దోడు సినిమాతో సక్సెస్ సాధిస్తే వాళ్లని ఎంకరేజ్ చేయడానికి చిన్నోడు వచ్చాడు అంటూ సోషల్ మీడియాలో వాళ్ళు కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ కొన్ని కామెంట్లైతే వైరల్ చేస్తున్నారు. మరి ఏది ఏమైనా కూడా 2013 వ సంవత్సరంలో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) సినిమాతో సంక్రాంతికి వచ్చిన వెంకటేష్ (Venkatesh) మహేష్ బాబు( Mahesh Babu) ఇద్దరూ ఆ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్నారు. ఇక అప్పటినుంచి వీళ్ళిద్దరిని పెద్దోడు, చిన్నోడు అంటూ పిలుస్తూ ఉండడం విశేషం…
మరి ఏది ఏమైనా కూడా వెంకటేష్, మహేష్ బాబు ఇద్దరూ కూడా నిజ జీవితంలో కూడా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారు. కాబట్టి ఒకరి సినిమా సక్సెస్ అయితే మరొకరు అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఒక రకంగానే ఈ సినిమా విషయంలో మహేష్ బాబు టీమ్ మొత్తానికి బూస్టప్ ఇవ్వడానికి ఆయన ఈ టీమ్ తో కలిసినట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి 2020వ సంవత్సరం సంక్రాంతి కానుకగా మహేష్ బాబుకి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి సక్సెస్ ని అందించాడు. కాబట్టి అనిల్ రావిపూడి తో కూడా మహేష్ బాబుకి చాలా మంచి సన్నిహిత్యమైతే ఉంది. ఇక అలాగే దిల్ రాజుతో కూడా మహేష్ బాబుకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ఇక వీళ్ళందరు తనకు కావాల్సిన వారే కాబట్టి వాళ్ల ఆనందాన్ని రెట్టింపు చేయడానికి మహేష్ బాబు కూడా వాళ్లకు తోడైనట్టుగా తెలుస్తోంది. ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో 106 కోట్ల షేర్ వసూలు చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇక అలాగే ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో మరో 220 కి పైన థియేటర్లను పెంచడం విశేషం…