Superstar Krishna- Mahesh Babu: తెలుగు చలన చిత్ర పరిశ్రమకి సాంకేతిక పరంగా, కమర్షియల్ పరంగా సూపర్ స్టార్ కృష్ణ మన పరిశ్రమ స్థాయిని వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు..అలాంటి మహనీయుడు ఇటీవల తన తుదిశ్వాస ని విడవడం ఘట్టమనేని కుటుంబాన్ని మరియు యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది..అయితే కృష్ణ అంత్యక్రియలు ఫిలిం నగర్ లోని మహాప్రస్థానం లో చెయ్యడం పై మహేష్ బాబు మీద అభిమానులు కాస్త గుర్రు గా ఉన్నారు.

అంతే కాకుండా తండ్రి చనిపోతే సంప్రదాయం ప్రకారం గుండు కూడా కొట్టించుకోకపోవడం పై ఫ్యాన్స్ తప్పుపట్టారు..ఈ క్రమం లో సూపర్ స్టార్ కృష్ణ పేరిట తెలుగోడు గర్వంగా చెప్పుకునేలా ‘సూపర్ స్టార్ కృష్ణ’ అవార్డ్స్ ని ప్రవేశపెట్టాలని మహేష్ బాబు సన్నాహాలు చేస్తున్నాడట..ఇందుకోసం ఆయన ఒక కమిటీ ని కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం..ప్రతి ఏడాది కృష్ణ పుట్టినరోజు అనగా మే 31 వ తారీఖున ఈ అవార్డ్స్ ఇవ్వాలని మహేష్ బాబు ప్లాన్ చేస్తునట్టు సమాచారం.
గతం లో కూడా ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్ పేరిట అవార్డ్స్ ఇచ్చేవారు..ఎన్టీఆర్ పురస్కారం గౌరవప్రదంగా ప్రభుత్వమే ఇస్తుండగా..ఏఎన్నార్ అవార్డ్స్ మాత్రం ప్రైవేట్ గా ఇచ్చేవారు..కానీ ఇప్పుడు అవార్డ్స్ సంగతి దేవుడెరుగు..కనీసం నంది అవార్డ్స్ కూడా గత కొంతకాలం నుండి ఇవ్వట్లేదు..అందుకే ఈ గ్యాప్ ని మహేష్ బాబు వినియోగించుకొని ప్రతి ఏడాది ఈ అవార్డుని ఉత్తమ సినిమాలకు, ఉత్తమ నటులకు మరియు సినిమాలో ఎన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయో అన్ని క్రాఫ్ట్స్ లో నైపుణ్యం చూపించిన వారికి ఈ అవార్డ్స్ ఇచ్చే ఆలోచనలో ఆయన ఉన్నాడట.

దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు సమాచారం..మరోపక్క రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సూపర్ స్టార్ కృష్ణ కి స్మారక స్తూపాలను తమ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసే ఆలోచన లో ఉన్న విషయం తెలిసిందే..ఇప్పుడు మహేష్ బాబు తలపెట్టిన ఈ ‘సూపర్ స్టార్ కృష్ణ’ అవార్డ్స్ కి సంబంధించి మరికొన్ని పూర్తి వివరాలు అతి త్వరలోనే తెలియనున్నాయి.