Mahesh Babu: మహేష్ బాబు టాలీవుడ్ టాప్ స్టార్. అతిపెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన హీరో. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆయన ప్రస్థానం మొదలైంది. దర్శకుడు రాఘవేంద్రరావు 1999లో రాజకుమారుడు చిత్రంతో హీరోగా పరిచయం చేశాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. మురారి, ఒక్కడు ఆయనకు స్టార్డం తెచ్చిపెట్టాయి. మహేష్ బాబు నటించిన పోకిరి ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. దూకుడు, శ్రీమంతుడు మహేష్ బాబు హైయెస్ట్ గ్రాసింగ్ చిత్రాలుగా అప్పట్లో రికార్డులకు ఎక్కాయి.
మహేష్ బాబు గత చిత్రం గుంటూరు కారం మిక్స్డ్ టాక్ తో కూడా భారీ వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం ఆయన ఎస్ఎస్ఎంబి 29కి సిద్ధం అవుతున్నారు. దర్శకుడు రాజమౌళితో ఫస్ట్ టైం మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో లుక్ కోసం మహేష్ బాబు లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు. మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో ఎస్ఎస్ఎంబి 29 నిర్మించనున్నారు.
పాన్ వరల్డ్ మూవీగా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. ఇది జంగిల్ అడ్వెంచర్ డ్రామా. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా మహేష్ బాబు పాత్ర ఉంటుందని సమాచారం. దాదాపు మూడేళ్లు ఈ సినిమా చిత్రీకరణకు మహేష్ బాబు కేటాయించారు. మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్ కోసం యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నాడనే పుకార్లు వినిపిస్తున్నాయి. కాగా మహేష్ బాబు గతంలో తాను నటించిన చిత్రాలను ఉద్దేశించి చేసిన కామెంట్స్ తాజాగా తెరపైకి వచ్చాయి.
కృష్ణ బాల్యం నుండే తన కొడుకులను నటులుగా తీర్చిదిద్దాలి అనుకున్నారు. మహేష్ బాబును చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేశాడు. మహేష్ బాబు సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన మొదటి చిత్రం నీడ. పసికందుగా ఉన్నప్పుడు చేసిన చిత్రం అది. అనంతరం పోరాటం, బజార్ రౌడీ, గూఢచారి 111, కొడుకులు దిద్దిన కాపురం, ముగ్గురు కొడుకులు చిత్రాల్లో నటించాడు.
ఈ సినిమాల షూటింగ్ కృష్ణ సమ్మర్ లో ప్లాన్ చేసేవాడట. స్కూల్ సెలవులు పూర్తి అయ్యే లోపు మూవీ కంప్లీట్ అయ్యేలా ప్రణాళికలు వేసేవారట. ఈ సినిమాలు బాగా ఆడాయి. కానీ ఎందుకు ఆడాయి అనేది నాకు తెలియదు. నాన్న నటించమంటే నేను నటించాను, అని మహేష్ బాబు అన్నారు. ఒక సినిమా షూటింగ్ సెలవులు ముగిసే నాటికి పూర్తి కాలేదట. దాని వలన ఒక ఏడాది చదువు కోల్పోయాడట. అప్పుడు కృష్ణ.. నటనకు విరామం ఇచ్చి, ముందు చదువు పూర్తి చెయ్ అన్నారట.
Web Title: Mahesh babu interesting comments about his films
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com