Pawan kalyan- Mahesh Babu: తెలుగు సినిమాల్లో హీరోలందరు కలిసే ఉంటారు. ఒకరి సినిమాకు మరొకరు వాయిస్ ఓవర్ ఇచ్చిన ఘటనలు చాలానే ఉన్నాయి. జల్సా, బాద్ షా సినిమాలకు మహేశ్ బాబు, మర్యాదరామన్న సినిమాకు రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఒకరి సినిమాలకు మరొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. వారి మధ్య స్నేహం కూడా అలాగే ఉంటుంది. ప్రతి క్రిస్మస్ పండగకు మహేశ్ బాబు ఇంటికి పవన్ కల్యాణ్ దంపతులు కానుకలు పంపిస్తూ ఉంటారు. అలాగే వారితోటలో పండిన మామిడి పంట్లు కూడా ప్రతి సీజన్ లో అందజేస్తుంటారు. ఇలా వారి మధ్య మంచి స్నేహ సంబంధం ఉండటం తెలిసిందే.

ఇక జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కూడా మంచి స్నేహితులు ఒకరి సినిమాలకు క్లాప్ కొట్టేందుకు మరొకరు వెళ్లడం సహజమే. పరిశ్రమలో నటుల మధ్య ఎంతో మంచి స్నేహసబంధాలు ఉండటంతో ఒకరి సినిమాలకు మరొకరు సహాయ పడుతూ వారి మధ్య స్నేహభావాన్ని పెంచుకుంటుంటారు. ఆ మధ్య త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన సినిమా అత్తారింటికి దారేది. ఇది ఎంతటి బ్రహ్మాండమైన హిట్ కొట్టిందో అందరికి తెలిసిందే. ఇందులో పవన్ కల్యాణ్ సరసన సమంత, ప్రణీత నటించారు.
Also Read: Nandamuri Hero: సినిమాలకు గుడ్ బై చెప్పేసిన నందమూరి హీరో
అత్తారింటికి దారేది సినిమాలో సమంత ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు విలన్ ఆమె కారుపై దాడి చేసి ఆమెను ఇంటికి చేర్చే ప్రయత్నం చేసినప్పుడు ఖలేజీ సినిమాలోని కారుడ్రైవర్ పాత్ర రాజు ను ఎంటర్ చేద్దామని మహేశ్ బాబుతో త్రివిక్రమ్ చెప్పాడట. కథ మంచి ఫ్లో ఉండగా కొత్త క్యారెక్టర్ ఎంటర్ చేస్తే బాగుండదు. మల్టీస్టారర్ కు ప్లాన్ చేస్తే ఇద్దరం నటిస్తామని చెప్పాడట. అలా మహేశ్ బాబు పవన్ కల్యాణ్ కలిసి నటించే అవకాశం మిస్ అయిందని అభిమానులు నిరాశ చెందారు.

ఇటీవల వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందనే ఊహాగానాలు వస్తున్నాయి. మల్టీస్టారర్ సినిమాలు వస్తే మంచిదే. ప్రేక్షకులు కూడా ఉత్సాహంగా ఫీలవుతారు. అందుకే సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్లలా ఉన్న పవన్ కల్యాణ్, మహేశ్ బాబు కలిసి నటించే అవకాశం కోసం అందరు ఆశగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్, మహేశ్ బాబులు కలిసి నటించే సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు. వీరి కలను త్రివిక్రమ్ తీరుస్తారో లేదో వేచి చూడాల్సిందే మరి.
Also Read: Ravi Teja Rama Rao On Duty: రవితేజకు షాక్, ఆ సీన్స్ లీక్.. టెన్షన్ లో రామారావు టీమ్ !