https://oktelugu.com/

Mahesh Babu Hard work: మహేష్ కష్టమంతా వృధా.. ఇది ఫ్యాన్స్ కి వ్యథే !

Mahesh Babu Hard work: ‘సర్కారు వారి పాట’ సినిమా రాక కోసం, మహేష్ అభిమానులతో పాటు మహేష్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాడు. కథలో విషయం ఉందని నమ్మిన మహేష్, సినిమాలో కూడా విషయం ఉంటుందని ఆశించాడు. కానీ, విషయం కంటే.. సోది ఎక్కువైంది. దాంతో, బాక్సాఫీస్ వద్ద ‘సర్కారు వారి పాట’కి ప్లాప్ టాక్ వచ్చింది. ప్యూర్ సోషల్ డ్రామా వ్యవహారాలతో సాగిన ఈ సినిమాలో రొటీన్ యాక్షన్ రెగ్యులర్ వ్యవహారాలు ఎక్కువ అయిపోయాయి. […]

Written By:
  • Shiva
  • , Updated On : May 14, 2022 / 03:02 PM IST
    Follow us on

    Mahesh Babu Hard work: ‘సర్కారు వారి పాట’ సినిమా రాక కోసం, మహేష్ అభిమానులతో పాటు మహేష్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాడు. కథలో విషయం ఉందని నమ్మిన మహేష్, సినిమాలో కూడా విషయం ఉంటుందని ఆశించాడు. కానీ, విషయం కంటే.. సోది ఎక్కువైంది. దాంతో, బాక్సాఫీస్ వద్ద ‘సర్కారు వారి పాట’కి ప్లాప్ టాక్ వచ్చింది. ప్యూర్ సోషల్ డ్రామా వ్యవహారాలతో సాగిన ఈ సినిమాలో రొటీన్ యాక్షన్ రెగ్యులర్ వ్యవహారాలు ఎక్కువ అయిపోయాయి. ఫలితంగా సినిమా పరాజయం అయ్యింది.

    Sarkaru Vaari Paata

    కానీ.. ఈ ప్లాప్ సినిమా కోసం మహేష్ చాలా కష్టపడ్డాడు. ఈ విషయం చాలా మందికి తెలీదు. సర్కారులో ఫుల్ ఫిట్ నెస్ తో కనిపించడానికి మహేష్ జిమ్ లో గంటల కొద్దీ వర్కౌట్లు చేశాడు. చెమటలు చిందించాడు. మేకర్స్ మహేష్ కష్టాన్ని చూపించడానికి ఈ వీడియోని బయటకు వదిలారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. తాజాగా మహేష్ ఫిట్నెస్ ట్రైనర్ ‘మినాష్’ కూడా ఈ వీడియోని మళ్ళీ షేర్ చేశాడు.

    Also Read: Vijay Devarakonda: విజయ్ దేవరకొండ కోసం పాకిస్తానీ అమ్మాయిగా పూజా హెగ్డే !

    పైగా ఈ వీడియోలో మహేష్ పడిన కష్టం గురించి మినాష్ మాట్లాడుతూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మరి ఆ కామెంట్స్ ఏమిటో మినాష్ మాటల్లోనే.. “సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా విడుదల అయ్యింది. కానీ, మీకు తెలియదు, గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం తెరవెనుక ఏమి జరిగిందో అని. అందుకే, మీ అందరికీ ఆ విషయాలు తెలియజేయాలని అనుకుంటున్నా.

    Mahesh Babu

    నిజానికి కోవిడ్‌ ఆంక్షల కారణంగా.. ఈ సినిమా విడుదల చాలా కాలం పాటు పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చింది. అయితే ఈ సినిమాని మహేష్ ఓ ఛాలెంజింగ్ గా తీసుకుని ఎంతో కష్టపడ్డారు. రోజుకు నాలుగు గంటల పాటు మహేష్ జిమ్ లో కష్టపడేవారు. నాకు తెలిసి, గతంలో ఏ సినిమాకి మహేష్ ఇంతలా కష్టపడలేదు’ అని మినాష్ కామెంట్స్ చేశారు.

    మినాష్ చెప్పింది నిజమే. ఈ మూవీలో మహేష్ నటనకి పేరు పెట్టలేం. అంత గొప్పగా మహేష్ ఈ సినిమాలో మెరిశాడు. పైగా ఎప్పుడు లేనిది కొత్త లుక్స్ లో చాలా వినూత్నంగా కనిపించాడు. ‘పోకిరి’ ‘ఖలేజా’ ‘దూకుడు’ ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి చిత్రాల్లో కంటే కూడా, మహేష్ ఈ సినిమాలో చాలా ఎనర్జిటిక్ గా కనిపించడం విశేషం. కానీ, సినిమానే ప్లాప్ అవ్వడం మహేష్ ఫ్యాన్స్ ను బాగా నిరాశ పరిచింది. ముఖ్యంగా మహేష్ కష్టం అంతా వృధా అయిపోయింది.

    Also Read: Somu Veerraju Sensational Comments: జనసేన పవన్ కళ్యాణ్ తో మాత్రమే బీజేపీ పొత్తు: సోము వీర్రాజు సంచలన ప్రకటన

     

    Tags