Mahesh: ఇంకో రెండు వారాల్లో కొత్త సంవత్సరం రానుంది. 2021 మొత్తం కరోనా భయంతో ఉక్కిరిబిక్కిరైతే.. ఇప్పుడు ఒమిక్రాన్‌గా అవతారమెత్తి మరోసారి అలజడి సృష్టించేందుకు సిద్ధమైంది కొవిడ్. అయితే, ఇదందా పక్కనపెడితే.. న్యూఇయర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది పార్టీలు, అల్లర్లు, ఎంజాయ్మెంట్. కొంతమంది ఫ్యామిలీతో కలిసి ఇంట్లోనే న్యూఇయల్ సెలబ్రేషన్స్ చేసుకుంటే. మరికొంత మంది ఫ్రెండ్స్‌తో ఎక్కడికైనా దూరంగా వెళ్లి వేడుక చేసుకోవాలనుకుంటుంటారు.

అయితే, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు మాత్రం దుబాయ్‌లో ఈ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలకనున్నారు. ప్రస్తుతం మహేశ్ స్పెయిన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఆటునుంచి అటే దుబాయ్ వెళ్తారని సమాచారం. అదే సమయానికి భార్య పిల్లలు కూడా దుబాయ్ వస్తారని తెలుస్తోంది. ఏటా మహేశ్ ఫ్యామిలీతే వెకేషన్‌కి వెళ్తుంటారు. ఈ సారి కూడా అలాగే ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. అయితే, ఇటీవలే మహేశ్ మోకాలిసి చిన్న సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. అది కూడా పెద్దదేం కాదని సమాచారం.
Also Read: ఆ హీరో ఫెయిల్యూర్ కి కారణం అతనే !
ఈ క్రమంలోనే కొన్ని రోజులు సరదాగా విశ్రాంతి తీసుకునేందుకు దుబాయ్ వెళ్తారట. మహేశ్కాలికి తగిలిన గాయం ఇప్పటిది కాదు.. స్పైడర్ సినిమా షూటింగ్లో ఆయనకు అనుకోకుండా ఆ గాయం తగిలింది. అదే సర్కారు వారి పాట సాంగ్ షూటింగ్లో దెబ్బకొట్టిందట. అయితే, పెద్దగా ప్రమాదమేం లేదని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సర్కారువారి పాటలో మహేశ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేశ్ ఇందులో హీరోయిన్గా కనిపించనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: శ్రీవిష్ణు ‘అర్జున ఫాల్గుణ’ సినిమా విడుదల తేదీ ఖరారు