Film industry: ఈ రోజు ‘స్పైడర్ మ్యాన్’.. రేపు ‘పుష్ప’, మరో వారంలో ’83’, ఆ తర్వాత రోజు ‘శ్యామ్ సింగరాయ్’.. ఇక ‘ఆర్ఆర్ఆర్’ దగ్గర నుంచి ప్రతి వారం భారీ సినిమాలే. రానున్న నాలుగైదు నెలలు భారతీయ సినిమా పరిశ్రమకు చాలా కీలకమైన సమయం. మరి ఏమిటి పరిస్థితి ? ఇప్పుడు అంతా ఒమిక్రాన్ భయం పట్టుకుంది. హైదరాబాద్ లో కూడా మూడు కేసులు వచ్చాయి. ఈ వైరస్ లక్షణం ఏమిటంటే.. వేగంగా వ్యాప్తి చెందుతుంది.

అసలుకే కరోనా కాలంలో సినిమా వ్యవస్థ పూర్తిగా నేలమట్టం అయిపోయే పరిస్థితి వచ్చింది. ఈ టైంలో ఇప్పుడు మళ్ళీ ఒమిక్రాన్ వైరస్ అటాక్ చేస్తే.. అసలు ఇక సినిమా ఇండస్ట్రీ కోలుకోలేదు. ఉదాహరణకు పుష్ప విషయానికే వద్దాం. పుష్పను భారీ స్థాయిలో బన్నీ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మించారు. సినిమాకు అద్భుతమైన టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ అవుతుందా ? అవ్వదా ? అనే అనుమానం ఉంది టీమ్ కి.
దీనికితోడు, ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారం ఉందనే ఉంది. కాబట్టి.. సినిమాకి సూపర్ డూపర్ హిట్ టాక్ బలంగా వచ్చినా.. టాలీవుడ్ లో ఏవరేజ్ కలెక్షన్స్ మాత్రమే వస్తాయి. వంద కోట్లు కలెక్ట్ చేసినా పుష్ప ఇంకా లాస్ లోనే ఉంటుంది. ఈ లెక్కన మళ్ళీ వైరస్ అటాక్ చేస్తే.. ఇక జనం థియేటర్స్ కి రారు. అప్పుడు పుష్ప ఈడు పోయిన చేనులా బీడు పోవాల్సిందే.
ఇది ఒక్క పుష్పకే కాదు, అన్నీ భారీ చిత్రాలకు వర్తిస్తుంది. నిజానికి ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రావడానికి ఇంకా ఆసక్తి చూపించడం లేదు. కొన్ని ఏరియాల్లో అయితే, కరోనా కారణంగా జనం ఇంకా భయపడుతునే ఉన్నారు. ఇలాంటి టైంలో వైరస్ వ్యాప్తి అనే మాట నిర్మాతలకు, హీరోలకు కచ్చితంగా కన్నీళ్లు పెట్టించేవే. సినిమా వాళ్ళ కన్నీళ్లకు ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో కరగదు.
Also Read: Meera Mithun: వివాదాస్పద హీరోయిన్ నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు !
పైగా మీ కన్నీళ్లకు మేము బాధ్యత వహించాల్సిన అవసరం లేదు అంటాయి ప్రభుత్వాలు. అందుకే, ఒమిక్రాన్ అనే పేరు వినగానే అన్నీ బాషల ఇండస్ట్రీలు వణికిపోతున్నాయి. ఎలాగూ ఈ వైరస్ ఉధృతి అతి తీవ్రంగా ఉండబోతోందని డబ్ల్యూ హెచ్ ఓ కూడా ఇప్పటికే ఘాటుగా హెచ్చరించింది. అసలుకే సోషల్ డిస్టెన్స్ అనగానే ప్రభుత్వాలు చేసే ముందు పని థియేటర్స్ ను క్లోజ్ చేయడమే. అందుకే, ఇప్పుడు భారీ చిత్రాల మేకర్స్ ఈ విషయంలో భయం భయంగా బతుకుతున్నారు .
Also Read: Pushpa: ‘పుష్ప’ను వెంటాడుతున్న సెన్సార్ కష్టాలు.. అక్కడ ఈరోజే?