Mahesh-Anushka : పెద్ద హీరోనా.. చిన్న హీరోనా.. అది పెద్ద సినిమానా.. చిన్న సినిమానా అని సంబంధం లేకుండా తనకు సినిమా కానీ నచ్చితే వెంటనే ప్రశంశాల పోస్ట్ పెట్టేస్తూ ఉంటారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు.
ఇక ఇప్పుడు అనుష్క రీసెంట్ సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి కూడా అదే చేశాడు. మొన్ననే మన సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా చూసి ఆ సినిమాని మెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక మరసటిరోజే మహేష్ అనుష్క.. నవీన్ పోలిశెట్టి సినిమా కూడా చూసేశారు. ఇక ఈ చిత్రం కూడా మన మహేష్ బాబుని బాగా ఆకట్టుకున్నట్టు ఉంది. ఇక ఆలస్యం ఎందుకని ఈ సినిమా పైన ప్రశంసల వర్షం కురిపించారు.
ఈ సినిమా గురించి చెబుతూ ఈ సినిమా చూసి ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసినట్టుగా తెలిపాడు. సూపర్ ఫన్ గా ఈ సినిమా ఉండగా మా ఫ్యామిలీ అంతా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేశామని అలాగే నవీన్ ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ అనుష్క ఎప్పటిలానే ఆదరగొట్టింది దర్శకుడు మహేష్, యూవీ క్రియేషన్స్ వారు మంచి సినిమా అందించారు అని మహేష్ అయితే తన ప్రశంసలు కురిపించారు. దీనితో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరోపక్క ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. అతడు, ఖలేజా లాంటి సినిమాల తరువాత త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవ్వడంతో ఈ చిత్రంపై ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి.