https://oktelugu.com/

Mahesh Babu Namrata Marriage: ‘నమ్రత’ను పెళ్లి చేసుకుంది అందుకే కదా.. మహేష్ ఓపెన్ స్టేట్ మెంట్

Mahesh Babu Namrata Marriage: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రమోషన్స్‌ కోసం వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ‘ఆస్క్ ఎనీథింగ్’ అంటూ నెటిజన్లకు అందుబాటులోకి వచ్చారు. అభిమానులు మహేష్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. వాటిలో కొన్ని ప్రశ్నలకు మహేష్ సమాధానం ఇచ్చారు. ఆ ప్రశ్నలేమిటో మీరు ఒక లుక్కేయండి. నెటిజన్ : హాయ్ సర్, మీ ఇంట్లో ఎవరు స్మార్ట్ ? మహేష్ […]

Written By:
  • Shiva
  • , Updated On : May 11, 2022 / 01:28 PM IST
    Follow us on

    Mahesh Babu Namrata Marriage: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా ప్రమోషన్స్‌ కోసం వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ‘ఆస్క్ ఎనీథింగ్’ అంటూ నెటిజన్లకు అందుబాటులోకి వచ్చారు. అభిమానులు మహేష్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. వాటిలో కొన్ని ప్రశ్నలకు మహేష్ సమాధానం ఇచ్చారు. ఆ ప్రశ్నలేమిటో మీరు ఒక లుక్కేయండి.

    Mahesh Babu, Namrata

    నెటిజన్ : హాయ్ సర్, మీ ఇంట్లో ఎవరు స్మార్ట్ ?
    మహేష్ : సితార.

    నెటిజన్ : పెన్నీ సాంగ్‌లో సితార నటించింది కదా ? మరి, త్వరలోనే సితారను మేం నటిగా చూడొచ్చా ?
    మహేష్ : ఆల్రెడీ సితార పాప ఇప్పటికే నటిగా నిరూపించుకుంది కదా.

    నెటిజన్ : ‘సర్కారు వారి పాట’ నుంచి వచ్చిన పోస్టర్స్ లో మీకు బాగా నచ్చిన పోస్టర్ ఏది ?
    మహేష్ : ఈ సినిమా నుంచి ఫస్ట్ రిలీజ్ చేసిన పోస్టర్.

    నెటిజన్ : మీ అభిమానులకు మీరిచ్చే మెసేజ్ ఏమిటి ?
    మహేష్ : ఎప్పుడూ సంతోషంగా ఉండండి.

    నెటిజన్ : నమ్రతలో మీకు బాగా నచ్చిన విషయం ఏమిటి ? అని ఓ నెటిజన్ అడగ్గానే..

    మహేష్ సిగ్గు పడుతూ : నాకు నమ్రతలో అన్ని విషయాలు నచ్చాయి. అందుకే కదా ? ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను’ అని మహేష్ చిన్న సిగ్గుతో నవ్వుతూ సమాధానం చెప్పారు. టాలీవుడ్ స్టార్ కపుల్స్ లో ‘మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్’ జంట ప్రత్యేకమైనది. అత్యంత అన్యోన్యమైన జంటగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.

    Also Read: Mahesh Babu Comments On Bollywood Entry: బాలీవుడ్ ఎంట్రీ పై మహేష్ షాకింగ్ కామెంట్స్

    Mahesh Babu, Namrata

    అసలు మహేష్ తో నమ్రతకు ఎలా జోడీ కుదిరింది !

    నమ్రతా శిరోద్కర్ తెలుగులో హీరోయిన్ గా బిజీ అవుతున్న రోజులు అవి. మహేష్ బాబు అప్పుడే తన ‘వంశీ‘ సినిమాను స్టార్ట్ చేస్తున్నాడు. అప్పటికీ మహేష్ కి గొప్ప స్టార్ డమ్ రాలేదు. అప్పట్లో మహేష్ చాలా సింపుల్ లైఫ్ స్టైల్ తో ఉండేవాడు. అలాంటి పరిస్థితుల్లో ‘వంశీ‘ సినిమా షూటింగ్ సమయంలో నమ్రతాన కలిశాడు. అలా ఒకరికొకరు పరిచయం అయ్యాక.. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. అలా చివరకు ఒక్కటి అయ్యారు.

    మహేష్ తో నమ్రత పెళ్లి ఎప్పుడు జరిగింది !

    మహేష్ సరసన వంశీ చిత్రంలో నటించిన తర్వాత.. నమ్రత సినిమాలను వదులుకుంది. మహేష్‌‌ ను 2005 ఫిబ్రవరిలో వివాహం చేసుకుంది. గౌతమ్ కృష్ణ, సితార పుట్టాక, మళ్లీ నమ్రత బిజినెస్ విమెన్ గా అవతారం ఎత్తింది. ఇక మహేష్ ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా పక్కా ఫ్యామిలీ మేన్. ఎంత బిజీగా ఉన్నా.. భార్య, పిల్లలతో కలిసి వీలు కుదిరినప్పుడల్లా విహార యాత్రలకు వెళ్తూ కుటుంబానికే మొదటి ప్రాదాన్యత ఇస్తాడు.

    Also Read: Sarkaru Vaari Paata: సర్కారివారి పాట వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
    Recommend Videos


    Tags