https://oktelugu.com/

Mahesh Babu : కెరియర్ మొదట్లో భారీ ప్లాప్ నుంచి తప్పించుకున్న మహేష్ బాబు…

ఇప్పటివరకు మహేష్ బాబు చేస్తున్న వరుస సినిమాలు మంచి విజయాలు అందుకోవడమే కాకుండా ఆయనకు సూపర్ స్టార్ రేంజ్ ను కూడా కట్టబెట్టాయి.

Written By:
  • NARESH
  • , Updated On : March 19, 2024 / 12:25 PM IST

    Mahesh Babu

    Follow us on

    Mahesh Babu : ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో మంచి అందగాడుగా గుర్తింపు పొందిన నటుడు శోభన్ బాబు. ఆయన ఎలాంటి పాత్రలు చేసిన ప్రేక్షకులు ఆయన సినిమాలకు బ్రహ్మరథం పట్టేవారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం ఆయన సినిమాలను చూడటానికి ఎక్కువగా అసక్తి చూపించేవారు. ఇక కొంతమంది అభిమానులైతే ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉండేవారు.

    అలాంటి శోభన్ బాబు తన కెరియర్ లో చాలా బంపర్ హిట్ లను అందుకున్నాడు. ఎన్టీఆర్, నాగేశ్వరరావు తర్వాత అంతటి గొప్ప సక్సెస్ లను అందుకున్న హీరోలలో శోభన్ బాబు కూడా ఒకరు. ఇక శోభన్ బాబు తర్వాత ఇప్పుడున్న హీరోల్లో చాలా అందంగా ఉండే హీరోల్లో మహేష్ బాబు ఒకరు. నిజానికి మహేష్ బాబు ఏజ్ పెరుగుతున్న కొద్దీ చాలా అందంగా తయారవుతున్నాడు. ఇక ఇది చూసిన చాలామంది ఆయనకు ఏజ్ పెరుగుతుందా లేదా తగ్గుతుందా అంటూ కామెంట్లను కూడా చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు కెరియర్ స్టార్టింగ్ లో చాలామంది డైరెక్టర్లతో వర్క్ చేశాడు. అందులో రాఘవేంద్రరావు, బిగోపాల్ లాంటి స్టార్ దర్శకులు ఉన్నారు.

    ఇక అందులో భాగంగానే సురేష్ కృష్ణ లాంటి స్టార్ డైరెక్టర్ తో కూడా మహేష్ బాబు వర్క్ చేయాల్సి ఉంది. కానీ అనుకో ని కారణాలవల్ల వాళ్ళిద్దరి కాంబోలో వచ్చే సినిమా పట్టాలెక్కలేదు. ఇక మహేష్ బాబు తో చేయాల్సిన సినిమాని సురేష్ కృష్ణ తారక రత్న హీరోగా భద్రాద్రి రాముడు అనే పేరుతో తెరకెక్కించాడు. ఈ సినిమా భారీ డిజాస్టర్ అయింది. ఇక ఆ సినిమాను చూసిన మహేష్ బాబు సురేష్ కృష్ణతో సినిమా చేయకపోవడమే మంచి పని అయింది అనుకున్నాడు. ఇక ఆయన తో సినిమా చేయకుండా సైడ్ అయిపోయాడు. ఇక మొత్తానికైతే మహేష్ బాబు ఒక భారీ ఫ్లాప్ నుంచి తప్పించుకున్నాడనే చెప్పాలి.

    ఇక అప్పటినుంచి ఇప్పటివరకు మహేష్ బాబు చేస్తున్న వరుస సినిమాలు మంచి విజయాలు అందుకోవడమే కాకుండా ఆయనకు సూపర్ స్టార్ రేంజ్ ను కూడా కట్టబెట్టాయి. ఇక కృష్ణ ఏ ఉద్దేశ్యంతో అయితే మహేష్ బాబును ఇండస్ట్రీకి తీసుకొచ్చాడో దానికి ఏమాత్రం తీసిపోకుండా స్టార్ హీరోగా ఎదిగి సూపర్ స్టార్ కృష్ణ పేరు ను నిలబెడుతున్నాడనే చెప్పాలి…