HBD Superstar MaheshBabu : చదువుకు బ్రేక్… సినిమాలే కరెక్ట్.. మహేష్ అలాంటి నిర్ణయం తీసుకున్నాడా!

మహేష్ బాబు పదిలో మంచి మార్కులు తెచ్చుకోకపోవటంతో తనకు ఎంతో ఇష్టమైన లయోలా కాలేజీలో సీటు రాలేదు.

Written By: NARESH, Updated On : August 9, 2023 8:27 pm

Mahesh Babu Records

Follow us on

HBD Superstar MaheshBabu : 48 వ పుట్టినరోజు జరుపుకుంటున్న మహేష్ బాబు కు సోషల్ మీడియా వేదికగా ఆయన ఫ్యాన్స్ సినీ జనాలు విషెస్ చెబుతూ హల్చల్ చేస్తున్నారు. ఎక్కడ చూసిన మహేష్ మేనియా కనిపిస్తుంది. ఈ స్థాయిలో అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న మహేష్ బాబు సినీ రంగ ప్రవేశం గురించి ఎవరికీ పెద్దగా తెలియని విషయాలు మీ కోసం.

ఆరేళ్ళ వయసులో తెలియకుండానే “నీడ” అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన మహేష్ బాబు ఆ తర్వాత చదువుకుంటూనే హాలిడేస్ లో సినిమాలు చేసేవాడు. బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూఢచారి 117, కొడుకు దిద్దిన కాపురం లాంటి అనేక సినిమాల్లో నటించి మెప్పించారు. అయితే సినిమా మోజులో పడి తన కొడుకు ఎక్కడ చదువుకు దూరం అవుతాడో అని భయపడిన కృష్ణ చదువు అయ్యేదాకా సినిమాల వైపు రావద్దని కండిషన్ పెట్టాడు.

దీంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి చదువు కొనసాగించిన మహేష్ బాబు పదిలో మంచి మార్కులు తెచ్చుకోకపోవటంతో తనకు ఎంతో ఇష్టమైన లయోలా కాలేజీలో సీటు రాలేదు. దీంతో ఎలాగైనా ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకొని డిగ్రీ అయిన లయోలా లో చదవాలని అనుకున్న మహేష్ అనుకున్నట్లే మంచి మార్కులు తెచ్చుకొని లయోలా లో బి.కామ్ లో సీటు సాధించిన కానీ డిగ్రీ అయ్యేలోపు తనకు చదువు మీద పెద్దగా ఆసక్తి లేదని గ్రహించిన మహేష్ బాబు తనకు సినిమా లే కరెక్ట్ అనుకోని ఆ విషయం కృష్ణ కి నేరుగా చెప్పారు.

దానికి కృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. మొదటి సినిమాతోనే నందిని గెల్చుకున్న ప్రిన్స్ ఆ తర్వాత ఎక్కడ కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. దాదాపు 350 సినిమాలు చేసిన కానీ ఒక్క నంది అవార్డు అందుకోలేదు కృష్ణ. కానీ చేసింది 27 సినిమాలే అయిన కానీ దాదాపు 8 నంది అవార్డ్స్ అందుకున్నాడు మహేష్ బాబు. ఒక రకంగా చెప్పాలంటే చదువు రావడం లేదని గ్రహించి సినీ రంగ ప్రవేశం చేసిన మహేష్ బాబు ఇప్పుడు అగ్రహీరోగా చలామణి అవుతూ, తండ్రికి తగ్గ తనయుడి గాపేరు గడించాడు మహేష్ బాబు.