Mahesh Babu Daughter Sitara: మహేష్ కూతురు ‘సితార’ డ్రీమ్ మాములుగా లేదుగా.. ఇది షాకింగే

Mahesh Babu Daughter Sitara: మహేష్ బాబు గారాలపట్టి ‘సితార’కి సోషల్ మీడియాలో హీరో రేంజ్ క్రేజ్ ఉంది. పైగా, ఫాలోయింగ్ లో స్టార్ కిడ్స్ లో సితార నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. ఐతే, తొమ్మిదేళ్ల సితార పాప ‘సర్కారు వారి పాట’ కోసం ఒక స్పెషల్ సాంగ్ చేసింది. సాంగ్ లో ‘సితార’ డ్యాన్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సితార, మహేష్ కంటే బాగా చేసింది అంటూ కితాబులు ఇచ్చారు. ప్రేక్షకులను […]

Written By: Shiva, Updated On : May 12, 2022 6:01 pm
Follow us on

Mahesh Babu Daughter Sitara: మహేష్ బాబు గారాలపట్టి ‘సితార’కి సోషల్ మీడియాలో హీరో రేంజ్ క్రేజ్ ఉంది. పైగా, ఫాలోయింగ్ లో స్టార్ కిడ్స్ లో సితార నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. ఐతే, తొమ్మిదేళ్ల సితార పాప ‘సర్కారు వారి పాట’ కోసం ఒక స్పెషల్ సాంగ్ చేసింది. సాంగ్ లో ‘సితార’ డ్యాన్స్ చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Sitara

సితార, మహేష్ కంటే బాగా చేసింది అంటూ కితాబులు ఇచ్చారు. ప్రేక్షకులను మెప్పించడంలో సితార ముందు నుంచి యాక్టివ్ గానే ఉంది. అందుకే, కాబోయే స్టార్ హీరోయిన్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ‘సర్కారు వారి పాట’ ప్రమోషన్స్ లో భాగంగా సితారను కొన్ని టీవీ ఛానళ్లు ఇంటర్వ్యూ చేశాయి.

Also Read: Poonam Bajwa నైట్ వేర్ లో మతిపోయే అందాలు ఆరబోసిన పూనమ్ బజ్వా.. గ్లామర్ ఫొటోలు

Sitara

అందులో భాగంగా సదరు యాంకర్ ‘మీరు భవిష్యత్తులో ఏం అవ్వాలనుకుంటున్నారు ? మీ డ్రీమ్ ఏంటి ? అని అడిగారు. దానికి సితార ‘నేను డాక్టర్ అవ్వను, అలాగే ఇంజనీర్ కూడా అవ్వాలని అనుకోవడం లేదు. ఖచ్చితంగా నేను యాక్టరే అవ్వాలని అనుకుంటున్నాను. అదే నా డ్రీమ్’ అంటూ కుండ బద్దలు కొట్టేసింది.

Sitara

‘సితార’ ఏమి చేసినా క్యూట్ గానే ఉంటుంది. తన లేలేత పలుకులతో ముద్దు ముద్దు చేష్టలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. చిన్న వయసులోనే యూట్యూబ్ వీడియోలు చేస్తూ తన తోటి కిడ్స్ లో తనకున్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు అనిపించుకుంది.

Sitara

ఐతే, సితార పాప బాలనటిగా మరో సినిమా చేయబోతుంది. దర్శకుడు వంశీ పైడిపల్లి తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజ్ నిర్మించే ఈ సినిమాలో ఒక చిన్నారి పాత్ర ఉంది. సినిమాలోనే ఎంతో కీలకమైన పాత్ర అది.

Sitara

ఇప్పుడు ఆ పాత్ర కోసం వంశీ సీతారని తీసుకోబోతున్నాడని తెలుస్తోంది. మహేష్ బాబు కుటుంబంతో వంశీ పైడిపల్లికి మంచి అనుబంధం ఉండటంతో.. మహేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Sitara

మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఇప్పటికే బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘1 నేనొక్కడినే’ సినిమాలో జూనియర్ మహేష్ బాబుగా గౌతమ్ నటించి మెప్పించాడు.

Sitara

అయితే, ఆ తర్వాత మళ్ళీ గౌతమ్ మరో సినిమాలో కనిపించలేదు. మరో నాలుగేళ్ళ తర్వాత హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి గౌతమ్ ప్రస్తుతం నటన పై దృష్టి పెట్టాడట. కానీ సితార మాత్రం కాస్త ముందుగానే నటిగా బిజీగా మారుతుంది.

Also Read:Karthika Deepam: స్విమ్మింగ్ పూల్ లో మత్తెక్కించేలా కార్తీక దీపం బ్యూటీ..చూస్తే అవాక్కే.. వీడియో వైరల్

Tags