Mahesh Babu Birthday: ప్రతీ ఏడాది మహేష్ బాబు(Superstar Mahesh Babu) పుట్టినరోజున అభిమానులు సంబరాలు ఏ రేంజ్ లో చేసుకుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన పాత సినిమాల్లో ఎదో ఒకదానిని సరికొత్త 4K టెక్నాలజీ కి అప్డేట్ చేసి థియేటర్స్ లో విడుదల చేసి సంబరాలు చేసుకుంటారు. ఈ ఏడాది అలా ఆయన కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిల్చిన ‘అతడు’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. దీనికి అభిమానుల్లోనే కాదు, మామూలు ఆడియన్స్ లో కూడా క్రేజ్ ఉంది. ఇది కాసేపు పక్కన పెడితే మహేష్, రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో సినిమా మొదలై చాలా రోజులైంది. రెండు భారీ షెడ్యూల్స్ ని కూడా పూర్తి చేశారు,కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఒక్క అప్డేట్ కూడా అధికారికంగా రాలేదు, దీనిపై మహేష్ ఫ్యాన్స్ తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ‘కింగ్డమ్’ ట్రైలర్ వచ్చేసింది..ఒకపక్క యాక్షన్..మరోపక్క ఎమోషన్!
గత ఏడాది మహేష్ పుట్టినరోజు అప్పుడు కూడా ఈ చిత్రానికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కనీసం ఈ ఏడాది అయినా ఇస్తారని అభిమానులు ఆశగా ఎదురు చూశారు. కానీ ఈసారి కూడా ఎలాంటి అప్డేట్ వచ్చే అవకాశం లేదట. దీంతో మహేష్ ఫ్యాన్స్ కి మళ్ళీ నిరాశే ఎదురైంది. రాజమౌళి మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు,కనీసం షూటింగ్ మొదలైంది అనే అప్డేట్ ఇస్తే ఏమి అవుతుంది?, అంటూ అభిమానులు మండిపడుతున్నారు. ఇకపోతే ఈ చిత్రం లో ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ వంటి వారు విలన్స్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ హీరో మాధవన్ ఇందులో మహేష్ బాబు కి తండ్రిగా నటిస్తాడట. ముందు గా ఈ పాత్ర కోసం అక్కినేని నాగార్జున ని తీసుకుందామని అనుకున్నారు, ఆ తర్వాత చియాన్ విక్రమ్ కోసం ప్రయత్నం చేశారు, చివరికి మాధవన్ చేతికి వెళ్ళింది. మన పురాణం రామాయణం ఇతిహాసం ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట రాజమౌళి. సంజీవని కోసం మహేష్ చేసే ప్రయాణమే సినిమా అంటున్నారు, మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి. ఈ చిత్రం లో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే మూడవ షెడ్యూల్ మొదలు కానుంది. ఈ షెడ్యూల్ కి సంబందించిన పూర్తి వివరాలు బయటుకు రావాల్సి ఉంది.