Hari Hara Veera Mallu Day 3 Collection: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బోల్తా కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రీమియర్ షోస్ కి ఎంతో ఉత్సాహంతో వెళ్లిన అభిమానులు, తీవ్రమైన నిరుత్సాహంతో తిరిగి వచ్చారు. అత్యాధునిక టెక్నాలజీ తో సినిమాలు చేస్తున్న ఈ రోజుల్లో, పాత పెళ్లి వీడియోల్లో ఉపయోగించిన VFX ని ఉపయోగించి, ఇష్టమొచ్చినట్టు టికెట్ రేట్స్ పెట్టి, థియేటర్స్ కి సినిమాని చూడండి అంటే జనాలు చూసేస్తారా?, పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యుండొచ్చు, కానీ ఏ స్థాయి వ్యక్తి అయినా థియేటర్ కి వచ్చి సినిమాని చూడాలంటే ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ని అందించాలి. అది అందించలేకపోతే ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమాని అయినా ఆడియన్స్ చూడట్లేదు. ఓటీటీ కాలం లో నడుస్తున్న ట్రెండ్ ఇదే.
Also Read: ‘కింగ్డమ్’ ట్రైలర్ వచ్చేసింది..ఒకపక్క యాక్షన్..మరోపక్క ఎమోషన్!
అయితే ఈ సినిమాకు నిన్న ఫస్ట్ షోస్ నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు భారీ గా పుంజుకున్నాయి. ముఖ్యంగా సెకండ్ షోస్ కి అయితే ఫ్యామిలీ ఆడియన్స్ క్యూలు కట్టడం తో అనేక చోట్ల థియేటర్స్ ని పెంచారు. అలా ఒక్కసారి భారీ గ్రోత్ ఉండడం తో ఈ చిత్రానికి నిన్న 5 నుండి 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది కూడా పవన్ కళ్యాణ్ రేంజ్ కి చిల్లరే. ఎందుకంటే ఆయన సపోర్టింగ్ క్యారక్టర్ చేసిన ‘బ్రో’ చిత్రానికి రెండవ రోజు, మూడవ రోజు చెరో 11 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చింది. అలాంటిది ఇంత పెద్ద సినిమా చేస్తే మూడవ రోజు అందులో సగం కూడా రాబట్టలేకపోయింది. ఇది కచ్చితంగా పవన్ కళ్యాణ్ రేంజ్ కి చిల్లరే,కానీ వచ్చిన ఘోరమైన డిజాస్టర్ టాక్ కి వసూళ్లు కాస్త పుంజుకున్నాయి అంటే, ఎక్కడో ఈ చిత్రాన్ని ఒక సెక్షన్ ఆడియన్స్ ఇష్టపడుతున్నారు అని అర్థం అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అందులో ఎంత వరకు నిజముందో నేడు వచ్చే వసూళ్లను బట్టీ అంచనా వేయొచ్చు. నేడు మార్నింగ్ షోస్ నుండి, ఫస్ట్ షోస్ వరకు ఈ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేసుకుంటే, ఇది కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి చేరువ అయ్యినట్టు లెక్క. అలా కాకుండా నిన్నటి లాగానే ఈరోజు కూడా ఉంటే మాత్రం, ఈరోజుతోనే బిజినెస్ క్లోజ్ అయ్యినట్టు భావించవచ్చు. రెండవ రోజు బుక్ మై షో యాప్ లో 98 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. కానీ మూడవ రోజు మాత్రం 1 లక్షా 5 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. నేడు ఈ చిత్రానికి కచ్చితంగా రెండు లక్షల టిక్కెట్లు అమ్ముడుపోవాలి, అప్పుడే ఈ సినిమాకి జనాల్లో మంచి టాక్ ఉన్నట్టు లెక్క. మరి ఏమి జరగబోతుందో చూద్దాం.