Mahesh Babu at Akkineni Akhil reception : అక్కినేని అఖిల్(Akkineni Akhil) వివాహం ఈ నెల 6 వ తేదీన నాగార్జున(Akkineni Nagarjuna) నివాసంలో గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహ మహోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కుటుంబం తో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరు అయ్యారు. తెల్లవారు జామున మూడు గంటలకు ఈ వివాహం జరిగింది. అభిమానులు ఉదయం నిద్రలేచి సోషల్ మీడియా తెరిచి చూడగానే అఖిల్ పెళ్లి ఫోటోలను చూసి ఎంతో సర్ప్రైజ్ కి గురయ్యారు. ఇదంతా పక్కన పెడితే నిన్న రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ అఖిల్, జైనబ్(Zainab Ravdjee) జంట నిశ్చితార్థం జరిగింది. ఈ నిశ్చితార్ధ వేడుకకు టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలతో పాటు, ప్రముఖ రాజకీయ నాయకులూ, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఇక టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం ఈ రిసెప్షన్ కి హాజరైన ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ లుక్స్ సోషల్ మీడియా లో ప్రకంపనలు సృష్టించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సింపుల్ గా టీ షర్ట్ వేసుకొచ్చి పెళ్ళికొడుకు,పెళ్లి కూతురుని డామినేట్ చేసేశాడు అని చెప్పొచ్చు. సింహం తో పోలిన లుక్స్ తో అదిరిపోయావ్ అన్నా అంటూ మహేష్ బాబు అభిమానులు నిన్నటి ఫోటోని సోషల్ మీడియా లో తిప్పుతూ ఒక రేంజ్ లో ఎలివేషన్స్ వేసుకుంటున్నారు. మహేష్ తో పాటు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్, సితార కూడా ఈ రిసెప్షన్ వేడుక లో పాల్గొన్నారు. అదే విధంగా ఈ రిసెప్షన్ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు అవ్వడం విశేషం. నాగార్జున స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి తన కొడుకు పెళ్ళికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. పెళ్ళికి ఆయన రాకపోవడంతో రిసెప్షన్ కి కూడా రాడేమో అని అంతా అనుకున్నారు. కానీ రిసెప్షన్ కి వచ్చి కూల్ సర్ప్రైజ్ ఇచ్చాడు సీఎం రేవంత్ రెడ్డి.
Also Read : ధూమ్ 4′ లో సూపర్ స్టార్ మహేష్ బాబు..? డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కూడా ప్రత్యేకంగా కలిసి వివాహానికి రావాలని ఆహ్వాన పత్రిక అందించిన సంగతి తెలిసిందే. కానీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఈ ఈవెంట్ కి హాజరు కాలేదు. సాధారణంగా చంద్రబాబు ఎవరు పెళ్ళికి పిలిచినా తనకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఆహ్వానాన్ని స్వీకరించి పెళ్ళికి లేదా రిసెప్షన్ కి హాజరు అవుతూ ఉంటాడు. కానీ ఎందుకో ఈసారి మాత్రం డుమ్మా కొట్టాడు. నాగార్జున మాజీ సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడు అవ్వడం వల్లే చంద్రబాబు నాయుడు అతన్ని దూరంగా పెట్టాడా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే నాగార్జున అప్పట్లో KCR ఫ్యామిలీ తో చాలా సన్నిహితంగా ఉండేవాడు. కానీ ఇప్పుడు తన కొడుకు పెళ్ళికి మాత్రం ఆహ్వానించలేదు. అంటే ఆయన పవర్ లో ఉన్న వాళ్ళకే విలువ ఇస్తాడని ఈ ఘటనతో తేలిపోయిందని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ మాట్లాడుతున్నారు.