Memu Famous Movie
Memu Famous Movie: టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు రేంజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పేరు ని ఒక బ్రాండ్ గా వాడుకొని కోట్ల రూపాయిలను సంపాదిస్తూ ఉంటుంది వాణిజ్య సంస్థలు. అంతే కాకుండా చిన్న సినిమాల పాలిట మహేష్ బాబు దేవుడిగా మారిపోయాడు. తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు మహేష్ బాబు ని ఒక మాధ్యమం గా వాడుకొని కోట్ల రూపాయిలు సంపాదించేస్తున్నారు.
మహేష్ బాబు కి సినిమాలు చూడడం అంటే బాగా ఇష్టం, విడుదలైన ప్రతీ సినిమాని చూస్తూ ఉంటాడు ఆయన. తన తోటి స్టార్ హీరోల సినిమాలు హిట్ అయ్యినప్పుడు కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేయడం మహేష్ బాబు కి అలవాటు.ఇది ఇలా ఉండగా చాయ్ బిస్కట్ సంస్థకి చెందిన సుమంత్ ప్రభాస్ హీరో గా నటించిన ‘మేము ఫేమస్’ అనే చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోస్ నేడు రాత్రి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో కొన్ని సెలెక్టివ్ థియేటర్స్ లో వేస్తున్నారు. అయితే ఈ చిత్రాన్ని చై బిస్కట్ టీం ముందుగానే మహేష్ బాబు కి చూపించారట. ఆయనకీ సినిమా బాగా నచ్చడం తో నేడు ఉదయం ట్విట్టర్ లో సినిమా చాలా బాగుంది , కంగ్రాట్స్ అంటూ మూవీ టీం మొత్తాన్ని ట్యాగ్ చేసి శుభాకాంక్షలు తెలియచేసాడు.
దీనితో ఈ సినిమాకి ఒక రేంజ్ పబ్లిసిటీ మరియు హైప్ వచ్చేసింది. దానివల్ల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగా జరుగుతున్నాయి. ఒక్కసారి బుక్ మై షో ఓపెన్ చేసి చూస్తే హైదరాబాద్ సిటీ లో వేస్తున్న ప్రీమియర్ షోస్ మొత్తం హౌస్ ఫుల్ అయ్యినవి మనం గమనించొచ్చు. మరి ఈ సినిమా రేపు ప్రేక్షకులు చూసిన తర్వాత మహేష్ బాబు లాగానే వావ్ అని అంటారో లేదో చూడాలి.