Mahesh Babu-Rajamouli: మహేష్ బాబు-రాజమౌళి ప్రాజెక్ట్ పై ఇండియా వైడ్ అంచనాలు ఉన్నాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ రేంజ్ కి వెళ్లిన రాజమౌళి నుండి వచ్చే నెక్స్ట్ మూవీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి ఉన్న మరో ప్రత్యేకత మహేష్ బాబు హీరో కావడం. మహేష్ బాబు, రాజమౌళి కలిసి మొదటిసారి మూవీ చేస్తున్నారు. ఈ మూవీ గురించి లేటెస్ట్ అప్డేట్ అందుతుంది. రాజమౌళి బాహుబలి సిరీస్ కి మించి ప్లాన్ చేస్తున్నారట. రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ తమ రైటింగ్ టీమ్ తో కలిసి చర్చలు జరుపుతున్నారట.
స్క్రీన్ ప్లే చివరి దశకు చేరుకోగా స్క్రిప్ట్ లాక్ చేయబోతున్నాడట. కాగా రెండు భాగాలుగా మూవీ తెరకెక్కించాలి. అది దృష్టిలో ఉంచుకుని ట్విస్ట్స్, టర్న్స్ ప్లాన్ చేయాలని చెప్పారట. రైటింగ్ టీమ్ ఈ ఆలోచన ఆధారంగా స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తున్నారట. కాబట్టి మహేష్ బాబు మూవీ రెండు భాగాలుగా విడుదల కానుందట. ఈ క్రమంలో ఐదేళ్లకు పైగా మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ లో లాక్ అయ్యే అవకాశం కలదు. ఒక్కో ప్రాజెక్ట్ బడ్జెట్ ఐదు వందల కోట్లకు పైనే ఉంటుందట. మొత్తంగా వెయ్యి కోట్ల వరకు ఈ మూవీస్ కోసం కేటాయించారట.
ఇక కథ, జోనర్ పై ఆల్రెడీ హింట్ ఇచ్చారు. జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా. మహేష్ ప్రపంచాన్ని చుట్టే సాహసికుడిగా కనిపిస్తాడట. హాలీవుడ్ సక్సెస్ఫుల్ సిరీస్ ఇండియానా జోన్స్ తరహా ఉంటుందట. ఓ ప్రముఖ ఇంగ్లీష్ నావెల్ నుండి కథ అడాప్ట్ చేసుకున్నారని సమాచారం. స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తి కావస్తుండగా త్వరలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మహేష్ బాబు గుంటూరు కారం ప్రాజెక్ట్ డిసెంబర్ కల్లా పూర్తి చేస్తాడు. తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్ కి సిద్ధం అవుతారు.
మహేష్ బాబుని డిఫరెంట్ లుక్ లో చూపించనున్నాడట. మహేష్ బాబు యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకోవాల్సి ఉందట. ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా సాధించాల్సి ఉంది. ఇక మహేష్-రాజమౌళి ప్రాజెక్ట్ కి హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పని చేయనున్నారు. హాలీవుడ్ నటులు కూడా భాగం కానున్నారట. ఇక ఈ ప్రాజెక్ట్ ని కే ఎల్ నారాయణ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మొత్తంగా మహేష్ మూవీ రెండు భాగాలుగా రానుందన్న న్యూస్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తుంది.