Mahesh Babu And Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు తెలుగుకు మాత్రమే పరిమితం అయ్యేది. కానీ కాలక్రమేణ రాజమౌళి పుణ్యమా అని బాహుబలి సినిమాతో ఇండియా వైడ్ గా విస్తరించింది. ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక రాజమౌళి తీసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఆయన తన తదుపరి సినిమాని ఎవరితో చేయబోతున్నాడు అంటూ అప్పట్లో కొన్ని ఆసక్తికరమైన కథనలైతే వెలువడ్డాయి. మొత్తానికైతే ఆయన మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నారనే ఒక భారీ ప్రకటన ఇవ్వడంతో అప్పటినుంచి ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ బజ్ అయితే క్రియేట్ అయింది. ఇక గత మూడు సంవత్సరాల నుంచి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న రాజమౌళి ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను ఈరోజు నిర్వహిస్తున్నాడు. మొత్తానికైతే ఈ సినిమాతో అటు రాజమౌళి, ఇటు మహేష్ బాబు ఒక్కసారిగా పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక నిధి వేట కోసం సాగే అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న తెలుస్తోంది. ఇక దాంతో పాటుగా ఈ సినిమాలో ‘ప్రియాంక చోప్రా’ హీరోయిన్ గా కూడా నటిస్తుంది. ఇక ఆమె తో పాటు పృధ్వీ రాజ్ సుకుమారన్ కూడా ఒక కీలక పర్థలో నటిస్తున్నాడు… అయితే రెండు పార్ట్ లుగా ఈ సినిమా తెరకెక్కబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక మొత్తానికైతే మొదటి పార్ట్ ని సమ్మర్ నుంచి రెగ్యులర్ షూట్ కి తీసుకెళ్ళి 2027 లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక సెకండ్ పార్ట్ విషయాన్ని రాజమౌళి స్వయంగా తనే తెలియజేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక హైదరాబాద్ నగర శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక దానికి సంబంధించి ఇప్పటికే మహేష్ బాబు నమ్రతాలు అక్కడికి చేరుకున్నారు. అలాగే మహేష్ బాబుకు సంబంధించిన ఒక కొత్త పోస్టర్ కూడా ప్రస్తుతం సోషల్ల మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించాలని అటు రాజమౌళి ఇటు మహేష్ బాబు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
అయితే చాలా రహస్యంగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించాలని రాజమౌళి చూస్తున్నాడు. అందుకే అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా లాంచింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది…