Mahesh Babu and Rajamouli : సూపర్ స్టార్ మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకి సంబంధించిన షూటింగ్ అతి త్వరలోనే మొదలు కాబోతుందని నిన్న రాజమౌళి పోస్ట్ చూసిన తర్వాత ప్రతీ ఒక్కరికి అర్థమైంది. మహేష్ బాబు తీరిక దొరికినప్పుడల్లా తన కుటుంబం తో కలిసి ఫారిన్ ట్రిప్స్ వేయడం చాలా కామన్. ఆయన ఏడాదికి షూటింగ్స్ చేసేది వంద రోజులైతే, ఫారిన్ టూర్స్ మిగతా 265 రోజులు వేస్తుంటాడు. ఎప్పుడూ విమానాశ్రయాల చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. అభిమానులు రాజమౌళి ని మా హీరో పాస్ పోర్ట్ ని లాగేసుకోండి సార్, ప్లీజ్ అంటూ అనేక మార్లు ఫన్నీ మీమ్స్ తో రాజమౌళి ని ట్యాగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మీమ్స్ రాజమౌళి వరకు వెళ్లినట్టు ఉన్నాయి. అందుకే ఆయన నిన్న మహేష్ బాబు పాస్ పోర్ట్ ని లాగేసుకొని సెజ్ చేసినట్టు ఒక వీడియో ని పెట్టాడు.
ఈ వీడియో కి వచ్చిన రెస్పాన్స్ మామూలుది కాదు. సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ గా మారిపోయింది. ఈ పోస్ట్ క్రింద మహేష్ బాబు స్పందిస్తూ ‘ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను’ అంటూ కామెంట్ చేసాడు. అంటే దీని అర్థం ఏమిటి?, నేను ఫారిన్ వెళ్ళాలి అనుకుంటే మీరు నా పాస్ పోర్ట్ లాగేసూకున్నా వెళ్ళగలను అంటున్నాడా?, లేకపోతే కమిట్మెంట్ ఇచ్చాను కాబట్టి, కమిట్ అయిపోయాను కాబట్టి మీరు అంత శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నాడా అనేది తెలియాల్సి ఉంది. మరోపక్క ఈ పోస్ట్ క్రింద మహేష్ సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా చప్పట్లు కొడుతూ రాజమౌళి చేసిన పనికి స్వాగతం పలికింది. ఇదే పోస్ట్ క్రింద ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా కామెంట్ చేసింది. మొత్తం మూవీ టీం మొత్తం ఆ పోస్ట్ క్రింద ఎమోజిస్ తో కనపడ్డారు.
అంటే రాజమౌళి తన సినిమాలో ఎవరెవరు నటించబోతున్నారు అనేది ఇలా టెక్నికల్ గా చెప్పుకొచ్చాడు అన్నమాట. ఓవరాల్ గా వెయ్యి కోట్ల రూపాయిల బడ్జెట్ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మరికొద్ది రోజుల్లోనే మొదలు కానుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేసి, గత ఆరు నెలలుగా అల్యూమినియం ఫ్యాక్టరీ లో నటీనటులకు వర్క్ షాప్స్ ని కూడా నిర్వహిస్తున్నారు. ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి, ఆ జానర్ కి తగ్గట్టుగా రాజమౌళి తన ఆర్టిస్టులను సిద్ధం చేసారు. ప్రియాంక చోప్రా కి గత రెండు మూడు రోజులుగా లుక్ టెస్ట్ పూర్తి అయ్యింది. రెండేళ్ల పాటు ఆమె డేట్స్ ని రాజమౌళి అడగగా, అందుకు ఆమె అంగీకరించినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ప్రియాంక చోప్రా, హాలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ కూడా పాపులర్ ఆర్టిస్ట్ అయ్యింది. ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ సినిమాగా రాజమౌళి అన్ని అంతర్జాతీయ భాషల్లో విడుదల చేయాలని అనుకుంటున్నాడు కాబట్టి, కచ్చితంగా హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా ఫేమ్ ఉపయోగపడుతుందని ఆమెని తీసుకున్నారు.