Mahesh Babu And NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ (Krishna) నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు(Mahesh Babu)…ఆయన చేసిన ప్రతి సినిమా తెలుగులో మంచి వీటిని సాధిస్తూ వచ్చాయి. దాంతో ఆయన చాలా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేసి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… ప్రస్తుతం ఆయన రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఒక పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా తనను తాను మరొకసారి పాన్ వరల్డ్ లో స్టార్ హీరోగా నిరూపించుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాడు… ఇక నందమూరి ఫ్యామిలీ మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఇండియా సినిమా ఇండస్ట్రీలో భారీ సక్సెస్ ను సాధించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని కనుక నమోదు చేసినట్లయితే మాత్రం ఆయన ఇండియాలో నెంబర్ వన్ హీరోగా మారతాడు. లేకపోతే మాత్రం తన మార్కెట్ ను మరింతగా కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇక మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఎప్పటినుంచో ఒక మల్టీ స్టారర్ సినిమా చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. కానీ అది వర్కౌట్ కావడం లేదు. ప్రస్తుతం ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వారు ఒక అడుగు ముందుకు వేసి వీళ్ళ కాంబినేషన్లో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథను కూడా పూర్తి చేయించే పనుల్లో బిజీగా ఉన్నారట. అయితే ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయంటూ పలు వార్తలైతే వస్తున్నాయి. ఇప్పటికే సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప 2(Pushpa 2) సినిమా ఇండియాలోనే భారీ వసూళ్లను సాధించి తెలుగు సినిమా ఇండస్ట్రీ ని టాప్ లెవల్లో నిలిపిందనే చెప్పాలి.
‘బాహుబలి 2’ (Bahubali 2) సినిమా రికార్డును బ్రేక్ చేయడంతో ఈ సినిమా సరికొత్త రికార్డును అయితే క్రియేట్ చేయగలిగింది. మరి సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిపోయిన తర్వాత మహేష్ బాబు ఎన్టీఆర్ లను పెట్టి ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…