కీర్తి సురేష్ ( Keerthy Suresh) – మహేష్ జోడీగా ఈ సీన్స్ సాగనున్నాయి. గోవాలోనే ఓ రిసార్ట్ లో ఈ లవ్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఈ సన్నివేశాలు రొమాంటిక్ టోన్ లో సాగుతాయని, ముఖ్యంగా కీర్తి సురేష్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. తన పాత్రకు తగ్గట్టుగానే కీర్తి సురేష్ ఇప్పటికే తన లుక్స్ ను కూడా మార్చుకుంది.
దర్శకుడు కోరినట్టు ఈ సీన్స్ కోసం కాస్ట్యూమ్స్ ను కూడా చేంజ్ చేయనుంది. ఈ సినిమాలో మహేష్ బాబు – కీర్తి సురేష్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయితే, ఇక ఈ సినిమాకి తిరుగుండదు అని దర్శకుడు పరుశురామ్ ఫీల్ అవుతున్నాడు. అందుకే ‘సర్కారు వారి పాట’లో రొమాంటిక్ ట్రాక్ ను చాలా వెర్షన్స్ రాశాడు.
పైగా వేరే రైటర్స్ కూడా చేత నాలుగు వెర్షన్స్ ను రాయించినట్లు టాక్. ఏది ఏమైనా ఇంట్రెస్ట్ తో సాగే ఈ రొమాంటిక్ ట్రాక్ లో మంచి ఫీల్ ను ఎలివేట్ చేయడానికి షాట్ మేకింగ్ విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టాడట. మొత్తానికి పరుశురామ్ బాగానే కష్టపడుతున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు లోన్లు వసూళ్లు చేసే కంపెనీకి బాస్ నటిస్తే.. కీర్తి సురేష్ ఆ కంపెనీలో పనిచేసే సాధారణ అమ్మాయిగా కనిపించనుంది.
కాగా సినిమాలో ఆమె పాత్ర పేరు కళావతి. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.