https://oktelugu.com/

Mahesh Babu: మళ్లీ విదేశాలకు మహేష్ బాబు… వైరల్ ఫోటోలు…

ఎయిర్ పోర్ట్ లో మహేష్ బాబు ఫ్యామిలీ అంతా కనిపించడంతో ఆయన దుబాయ్ కి ఫ్యామిలీ తో వెళ్తున్నట్టు గా తెలుస్తుంది.

Written By: , Updated On : December 29, 2023 / 06:16 PM IST
Mahesh Babu

Mahesh Babu

Follow us on

Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడంలో ఎప్పుడు ముందంజలో ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చాలా మంచి సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులలో ఒక చెరగని ముద్ర వేసుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సినిమాలు కూడా ఆయనకు మంచి ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టాయి ఇక ప్రస్తుతం ఆయన గుంటూరు కారం సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా మహేష్ బాబు దుబాయ్ కి తన ఫ్యామిలీతో కలిపి ట్రిప్ కి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఎయిర్ పోర్ట్ లో మహేష్ బాబు ఫ్యామిలీ అంతా కనిపించడంతో ఆయన దుబాయ్ కి ఫ్యామిలీ తో వెళ్తున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఈ ట్రిప్ లో ఒక ఆడ్ షూటింగ్ లో కూడా మహేష్ బాబు పాల్గొనబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక దాంతోపాటుగా న్యూ ఇయర్ వేడుకలను కూడా దుబాయ్ లోనే జరుపుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దుబాయ్ నుంచి 5 వ తేదీన హైదరాబాద్ కి చేరుకొనున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాంతో 6 వ తేదీన గుంటూరు కారం ప్రి రిలీజ్ ఈవెంట్ కి హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ లెక్కన మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో మంచి సక్సెస్ సాధించుకోబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక ఇప్పటికే త్రివిక్రమ్ అరవైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్టు కొట్టాడు. ఇక ఇప్పుడు గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు కి ఇండస్ట్రీ హిట్ ని అందించాలని చూస్తున్నాడు. అయితే త్రివిక్రమ్ మహేష్ బాబుతో రెండు సినిమాలు చేసినప్పటికీ అవి రెండు కూడా పెద్దగా సక్సెస్ ని సాధించలేదు.

దాంతో మహేష్ బాబు కి ఒక హిట్ బాకీ పడి ఉన్నాడు కాబట్టి ఈ సినిమాతో భారీ హిట్ ని మహేష్ బాబుకి అందించాలని చూస్తున్నాడు. త్రివిక్రమ్ తో చేసిన అందరి హీరోలకు ఆయన భారీ హిట్ ఇచ్చాడు కానీ మహేష్ బాబు కి మాత్రం ఇంతవరకు ఒక్క హిట్ కూడా ఇవ్వలేదు అందుకే ఈ సినిమాతో భారీ హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు…