
టాలీవుడ్ స్టార్ కపుల్స్ లో ‘మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్’ జంట ప్రత్యేకమైనది. మహేష్ సూపర్ స్టార్ అయినా పక్కా ఫ్యామిలీ మేన్. ఎంత బిజీగా ఉన్నా.. భార్య, పిల్లలతో కలిసి వీలు కుదిరినప్పుడల్లా విహార యాత్రలకు వెళ్తూ కుటుంబానికే మొదటి ప్రాదాన్యత ఇస్తుంటాడు. కాగా ఈ రోజు వీరి వివాహ వార్షికోత్సవం. అత్యంత అన్యోన్యమైన జంటగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన మహేష్ బాబు, నమ్రతకు పెళ్లిరోజు శుభాకాంక్షలు.
Also Read: రెబల్ స్టార్ ను మల్దీవుల్లో ఇలా చూసి తట్టుకోగలమా?
ఇక ఈ సందర్భంగా నమత్ర సోషల్ మీడియా ద్వారా మహేష్‌కు విషెస్ చెప్తూ ఎమోషనల్ మెసేజ్ పెట్టింది. `ఈ 16 ఏళ్లు చాలా సరదాగా గడిచిపోయాయి. బలమైన ప్రేమ, నమ్మకం, విశ్వాసం కలయికతో మన వైవాహిక జీవితం రూపుదిద్దుకుంది. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మహేష్ బాబు. నిన్ను మరింత ఎక్కువగా ప్రేమిస్తున్నాను’ అంటూ నమ్రత పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా మహేష్ ను ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను కూడా పోస్ట్ చేసింది. ఈ ఫోటో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.
Also Read: అప్పుడు గుంపులో గోవింద పాత్రలు.. ఇప్పుడు అనసూయ కోసమే ప్రధాన పాత్రలు!
కాగా 2000 సంవత్సరంలో వచ్చిన వంశీ సినిమా షూటింగ్ సమయంలో మొదటిసారి మహేష్, నమ్రతల మధ్య పరిచయం ఏర్పడడింది. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వచ్చింది. వీరిద్దరి జీవితాల్లో వంశీ సినిమా అంత విలువైనది. మా ఇద్దరి జీవితాలని ఎంతగానో మార్చేసిన సినిమా వంశీ అని ఆ మధ్య నమ్రత చెప్పుకొచ్చింది. అన్నట్లు వంశీ మహేష్ బాబుకి తెలుగులో మూడో సినిమా కాగా, నమ్రత శిరోద్కర్ కి మాత్రం మొదటి సినిమా. ఈ సినిమా విడుదలైన ఐదేళ్ళకు 2005 ఫిబ్రవరి 10 న మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ పెళ్లి చేసుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్