https://oktelugu.com/

Sumanth: సుమంత్ హీరో గా మరో కాంతార… వర్కవుట్ అవుతుందా..?

దర్శకుడు సంతోష్ జాగర్లపూడి చాలా తెలివిగా ఈ గ్లింమ్స్ ని రూపొందించి ప్రేక్షకుల ముందుకు వదిలినట్టుగా తెలుస్తుంది. ఈ గ్లింమ్స్ లో సుమంత్ నిప్పు కాగడ పట్టుకొని కదులుతూ ఉంటే పక్క నుంచి వరాహ స్వామి అరుపు వినిపిస్తూ ఉంటుంది.

Written By:
  • Gopi
  • , Updated On : December 2, 2023 / 08:37 AM IST

    Sumanth

    Follow us on

    Sumanth: అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన మూడోవ తరం హీరోగా సుమంత్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక నిజానికి ఈయన మొదట్లో చేసిన సినిమాలు మంచి విజయాలను అందుకున్నప్పటికీ ప్రస్తుతం ఈయన సక్సెస్ కొట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. హీరో మెటీరియల్ తో ఉండి చూడగానే హీరో అనే పదానికి జస్టిఫికేషన్ ఇచ్చే విధంగా ఉండే సుమంత్ కి ఒక్క సినిమా మాత్రం సక్సెస్ పడడం లేదు.

    ఎందుకంటే ఆయన ఎంచుకున్న కథలు అతనికి కలిసి రావడం లేదంటూ చాలా రోజులుగా చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మాత్రం ఆయన మహేందర్ గిరి వారాహి అనే సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా తెలుగులో ఇంతవరకు ఎవరు టచ్ అయిన సబ్జెక్టుతో వస్తున్నట్టుగా తెలుస్తుంది. దైవత్వంతో మనిషి జీవనానికి గల సంబంధమేంటి అనే తరహాలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు ముఖ్యంగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింమ్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది.

    దర్శకుడు సంతోష్ జాగర్లపూడి చాలా తెలివిగా ఈ గ్లింమ్స్ ని రూపొందించి ప్రేక్షకుల ముందుకు వదిలినట్టుగా తెలుస్తుంది. ఈ గ్లింమ్స్ లో సుమంత్ నిప్పు కాగడ పట్టుకొని కదులుతూ ఉంటే పక్క నుంచి వరాహ స్వామి అరుపు వినిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో మహేందర్ గిరి వారాహి అనే టైటిల్ ని పెద్దగా ఓపెన్ చేశారు. అయితే అక్కడ హీరో అయిన సుమంత్ చీకటి అనే అన్యాయాన్ని పారద్రోలాడానికి నిప్పుని వెలిగించుకొని ముందుకు కదులుతున్నాడు అలాగే చీకట్లో కలిసిపోయిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి తను ముందుకు కదులుతున్నాడు.ఆ దారి లో వరాహ స్వామి అరుస్తూ నేను నీకు తోడు గా ఉన్నాను అని చెప్తున్నాడు అనేది ఇక్కడ డైరెక్టర్ మనకు సింబాలిక్ గా చెప్పాడు. ఇక ఈ సినిమా సెటప్, బ్యాక్ డ్రాప్ మొత్తం చూస్తూ ఉంటే ఈ సినిమా తెలుగులో ఒక కాంతార సినిమాల మంచి విజయం సాధిస్తుందని చాలా మంది ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

    ఇక ఈ సినిమా లో వారాహి దేవతల గురించి చాలా క్లియర్ కట్ గా కొత్త తెలియజేసే ప్రయత్నం చేస్తున్నట్టు గా కూడా మనకు అర్థమవుతుంది. అందుకే ఈ సినిమాని అందరూ కాంతార సినిమాతో పోలుస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన పోస్ట్ లు చేస్తున్నారు…ఒక గ్లింమ్స్ తోనే ఇంత భారీ రెస్పాన్స్ ని సంపాదించుకున్న ఈ సినిమా టీజర్ గాని, ట్రైలర్ గానీ వదిలిన తర్వాత ఇంకా ఏ రేంజ్ లో హైప్ ని క్రియేట్ చేసుకుంటుందనేది చూడాలి. ఇక ఈ సినిమాతో సుమంత్ మాత్రం ఒక భారీ హిట్ కొట్టి తను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతున్నట్టుగా తెలుస్తుంది…