Mahaveerudu Collections: తమిళ స్టార్ హీరోలలో ఒకరైన శివ కార్తికేయన్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మహావీరుడు’ గుట్టు చప్పుడు కాకుండా తెలుగు రాష్ట్రాల్లో విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలోని ఫస్ట్ హాఫ్ చూసి ఆడియన్స్ పగలబడి నవ్వుకున్నారు. పిరికివాడైన హీరో పాత్ర నుండి పుట్టే కామెడీ మరియు ఎమోషన్స్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.
అందుకే ఈ చిత్రం సైలెంట్ గా వచ్చినప్పటికీ, మంచి వసూళ్లనే రాబట్టి ముందుకు దూసుకుపోతుంది. శివ కార్తికేయన్ గత మూడు చిత్రాలలో ‘వరుణ్ డాక్టర్’ , ‘డాన్’ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత వచ్చిన ‘ప్రిన్స్’ అనే చిత్రం కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యినప్పటికీ , ఒక సెక్షన్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది. అందుకే ‘మహావీరుడు’ చిత్రానికి పెద్దగా పబ్లిసిటీ చెయ్యకపోయినా మంచి ఓపెనింగ్ దక్కింది.
మొదటి రోజు ఈ చిత్రానికి దాదాపుగా 77 లక్షల రూపాయిలు గ్రాస్ వసూళ్లు రాగా , రెండవ రోజు మొదటి రోజు కంటే ఎక్కువగా 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలా రెండు రోజులకు కలిపి కోటి 67 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా, 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక మూడవ రోజు మొదటి రెండు రోజులకంటే ఎక్కువగా కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
అలా మొత్తం మీద మూడు రోజులకు కలిపి ఈ సినిమా తెలుగు వెర్షన్ కి గాని రెండు కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్, అలాగే కోటి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 5 కోట్ల రూపాయలకు జరిగింది. ఇంకా ఈ సినిమా వసూలు చెయ్యాల్సిన టార్గెట్ చాలా పెద్దదే, కానీ సినిమా లో విషయం ఉంది కాబట్టి లాంగ్ రన్ లో కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుందని నమ్ముతున్నారు ఆడియన్స్.