Mahalakshmi Ravindar: సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు డైరెక్టర్లను, నిర్మాతలను పెళ్లి చేసుకున్నవారు ఎందరో ఉన్నారు. ఈ సంప్రదాయం బుల్లితెరపై కూడా కొనసాగింది. టీవీ సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన విజే మహాలక్ష్మి.. నిర్మాత రవీందర్ ను వివాహం చేసుకుంది. భర్త రవీందర్ పర్సనాలిటీ ఎక్కువగా ఉండడంతో వీరి వివాహ ఫొటోలను చూసి చాలా మంది డబ్బు కోసమే రవీందర్ ను పెళ్లి చేసుకుందని అప్పట్లో విపరీతమైన ట్రోలింగ్ చేశారు. కానీ తమ ఆకారాలు వేరైనా.. మనసులు ఒక్కటేనని మహాలక్ష్మి ట్రోలర్స్ కు చెక్ పెట్టింది. ఇటీవల రవీందర్ ఓ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భర్త రవీందర్ పై మహాలక్ష్మీ సంచలన కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
సీరియల్ నిర్మాతగా రవీందర్ కు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ క్రమంలో మహాలక్ష్మీతో పరిచయం అయిన తరువాత ఆమెను ఇష్టపడ్డారు. దీంతో మహాలక్ష్మీ సైతం రవీందర్ పై మనసు పారేసుకొని ఆ తరువాత అతడిని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లపాటు వీరు ఎక్కడికి వెళ్లినా తమకు సంబంధించిన పిక్స్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఆడియన్స్ ను అలరించేది. దీంతో వీరిది అన్యోన్య జంట అని కొందరు కొనియాడారు. ఇలా వీరు ఎంతో సంతోషంగా జీవిస్తున్న తరుణంలో రవీందర్ ఓ కేసులో ఇరుక్కున్నాడు.
చెన్నైలోని ఓ వ్యక్తితో కలిసి బిజినెస్ చేద్దామని, అతని వద్ద రూ.15 కోట్లు తీసుకొని మోసం చేశాడని సదరు వ్యక్తి రవీందర్ పై కేసు పెట్టారు. దీంతో మహాలక్ష్మీ ఈ విషయంపై నిన్నటి వరకు ఎలాంటి కామెంట్ చేయలేదు. దీంతో మహాలక్ష్మీ, రవీందర్ ల మధ్య మనస్పర్థలు వచ్చాయని, త్వరలో వీరు విడాకులు తీసుకుంటారని కొందరు పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. వీటిపై మహాలక్ష్మీ స్పందించారు. తాము ఎప్పటికీ విడిపోవడం జరగదని స్పష్టంగా చెప్పారు.
అయితే తాజాగా మహాలక్ష్మీ చేసిన కొన్ని కామెంట్స్ ఆసక్తిని రేపుతోంది. తన భర్తపై నమోదైన కేసుతో తనకు సంబంధం లేదని చెప్పింది. రవీందర్ తో పెళ్లి కాకముందే ఈ ఇష్యూ జరిగిందని, దీనికి తాను ఎలా బాధ్యత వహిస్తానని చెబుతోంది.అంతేకాకుండా రవీందర్ తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని మహాలక్ష్మి తన సన్నహితుల వద్ద చెప్పినట్లు బయట వినిపిస్తోంది. అయితే మహాలక్ష్మీ అంతకుముందే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వీరి విడాకులపై మరోసారి హాట్ హాట్ గా చర్చ సాగుతోంది.