
Magadheera Khushi Re Release: రీసెంట్ గా ప్రతి ఇండస్ట్రీలోను రీ రిలీజ్ ట్రెండ్ బాగా ఊపందుకుంది.స్టార్ హీరోల కెరీర్స్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచినా ఎన్నో సినిమాలను దర్శక నిర్మాతలు లేటెస్ట్ టెక్నాలజీ కి మార్చి విడుదల చేస్తున్నారు.కొన్ని సినిమాలు వర్కౌట్ అయ్యాయి కానీ, కొన్ని కాలేదు.ముఖ్యంగా మన టాలీవుడ్ లో పోకిరి , జల్సా మరియు ఖుషి సినిమాలు రీ రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ని దున్నేశాయి.
కానీ మిగిలిన సినిమాలు మాత్రం ఆ రేంజ్ లో ఆడలేదు.ఇప్పుడు ఖుషి రికార్డ్స్ ని బద్దలు కొట్టడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మన ముందుకి రాబోతున్నాడు.వచ్చే నెల 27 వ తారీఖున రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్లో మాత్రమే కాకుండా, ఇండస్ట్రీ లోనే రికార్డ్స్ అన్నిటినీ తిరగరాసిన ‘మగధీర’ చిత్రాన్ని లేటెస్ట్ 4K టెక్నాలజీ కి మార్చి విడుదల చెయ్యబోతున్నారు.
ఈ విషయాన్నీ కాసేపటి క్రితమే ఆ చిత్రాన్ని నిర్మించిన ‘గీత ఆర్ట్స్’ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేసింది.మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాని కేవలం తెలుగు లో మాత్రమే కాదు, హిందీ, కన్నడం, తమిళం మరియు మలయాళం బాషలలో కూడా రీ రిలీజ్ చెయ్యబోతున్నారు.అలా రీ రిలీజ్ ట్రెండ్ లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవ్వబోతున్న మొట్టమొదటి సినిమాగా మగధీర సరికొత్త రికార్డుని నెలకొల్పబోతుంది.

ఇదంతా చూస్తూ ఉంటే కచ్చితంగా ఈ చిత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన జల్సా మరియు ఖుషి రికార్డ్స్ ని చాలా తేలికగా ఈ చిత్రం క్రాస్ చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.మరి ఈ సినిమా వాళ్ళ అంచనాలను అందుకుంటుందా లేదా అనేది చూడాలి.ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాసిన చిత్రం కాబట్టి రీ రిలీజ్ లో కూడా కచ్చితంగా రికార్డ్స్ నెలకొల్పుతుందని భావిస్తున్నారు ఫ్యాన్స్.