Vishal: యాక్షన్ హీరో విశాల్ కి మంచి నేమ్ ఉంది. మంచి వాడు అని ఇండస్ట్రీలో కూడా అందరూ చెబుతారు. అయితే ఇలాంటి హీరో పై చీటింగ్ కేసు ప్రస్తుతం వైరల్ అవ్వడం షాకింగ్ విషయమే. ఇంతకీ అసలు విషయంలోకి వెళ్తే.. లైకా ప్రొడక్షన్స్‌కు రూ.21.29 కోట్ల అప్పు చెల్లింపుల కేసులో హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు మరో రెండువారాల గడువు ఇచ్చింది. ఆస్తుల వివరాలతో కూడిన సరైన పత్రాలను సమర్పించాలని ఆదేశించింది.

పైగా తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. కాగా, తన చిత్ర నిర్మాణ సంస్థ ఒకే రోజు రూ.18 కోట్లు నష్టపోవడంతో అప్పు చెల్లించలేకపోయానని విశాల్ కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. మరి ఈ నెల 23 న విశాల్ ఏ విషయం చెబుతాడో చూడాలి. పైగా ఆస్తుల వివరాలు సమర్పించండి అని విశాల్ కి కోర్టు ఆదేశాలు జారీ చేయడం ఆయన ఇమేజ్ కే అవమానం. మరి ఇప్పుడు విశాల్ ఏం చేస్తాడో చూడాలి.
అయితే, విశాల్ ఇలాంటి విషయంలోనే గతంలో కేసు పెట్టాడు. ‘సూపర్ గుడ్ ఫిల్మ్స్’ బ్యానర్ కి ఒక విలువ ఉంది. ఆ మూవీ ప్రొడక్షన్ హౌజ్ అధినేత ఆర్బీ చౌదరి పై సౌత్ సినిమా ఇండస్ట్రీలో అందరికి ఒక గౌరవం ఉంది. కానీ హీరో విశాల్, ఆర్బీ చౌదరి పై పోలీసులకు ఆ మధ్య ఫిర్యాదు చేశాడు. ఇంతకీ విశాల్, చౌదరి పై ఎందుకు ఫిర్యాదు చేశాడు అంటే ఒక చీటింగ్ కేసులో.
ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విశాల్ డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వకుండా ఆర్బీ చౌదరి చీట్ చేశాడట. అందువల్ల, విశాల్ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2018లో ఇరుంబుతిరమ్ (తెలుగు వెర్షన్ వచ్చే సరికి అభిమన్యుడు) సినిమాను విశాల్ తన ఓన్ బ్యానర్ లోనే నిర్మించాడు. అయితే, ఆ సమయంలో విశాల్ ఆ సినిమా వల్ల కొన్ని ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

దాంతో, విశాల్, డబ్బు కోసం ప్రముఖ నిర్మాత మరియు ఫైనాన్షియర్ అయిన ఆర్బీ చౌదరి దగ్గరకు వెళ్లి కొంత అప్పు తీసుకున్నారు. అప్పుకు ప్రతిగా చెక్ లు, బాండ్లు, ప్రామిసరీ నోట్లను తాకట్టు పెట్టాడట. ఆ తరువాత విశాల్, ఆ అప్పు మొత్తం తీర్చాడు. అయినప్పటికీ విశాల్ పత్రాలను ఇవ్వకుండా ఆర్బీ చౌదరి తిప్పించుకుంటూ చీట్ చేస్తున్నాడట.
దీంతో విసిగిపోయిన విశాల్, అసహనం వ్యక్తం చేస్తూ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సేమ్ ఇప్పుడు విశాల్ ఇలాంటి కేసులోనే ఇరుక్కోవడం నిజంగా షాకింగ్ విషయమే. ఆర్బీ చౌదరి లాంటి పెద్దాయన పరువు తీశావు, అందుకే ఇప్పుడు నీ పరువు పోతుంది అంటూ సోషల్ ,మీడియాలో యాంటీ ఫ్యాన్స్ విశాల్ కి ట్వీట్స్ చేస్తున్నారు.