Homeఎంటర్టైన్మెంట్Maa Inti Bangaram first day collections: 'మా ఇంటి బంగారం' మొదటి రోజు వరల్డ్...

Maa Inti Bangaram first day collections: ‘మా ఇంటి బంగారం’ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఓవర్సీస్ లో ప్రభంజనం..

Maa Inti Bangaram first day collections: వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎగురుకుంటూ తీవ్రమైన సంక్షోభం లో ఉన్నటువంటి మన టాలీవుడ్ కి ‘పెద్ది’ ఇచ్చిన ధైర్యం మామూలుది కాదు. చాలా కాలం తర్వాత థియేటర్స్ మొత్తం హౌస్ ఫుల్స్ బోర్డ్స్ తో కనిపించేలా చేసిన చిత్రమిది. కేవలం వీకెండ్ కి మాత్రమే ఈ సినిమా పరిమితం అయిపోలేదు , దాదాపుగా 2 వారాల పాటు వర్కింగ్ డేస్ లో కూడా మంచి వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా ఇచ్చిన జోష్ ని సమంత ‘మా ఇంటి బంగారం’ చిత్రం తో కొనసాగించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వసూళ్లకంటే కూడా, ఈ చిత్రానికి ఓవర్సీస్ లో వచ్చిన గ్రాస్ వసూళ్లు ఎక్కువగా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిని బట్టీ సమంత కి ఓవర్సీస్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

కేవలం ఒక్క ఓవర్సీస్ నుండే ఈ చిత్రానికి మొదటి రోజున 7 లక్షల డాలర్లు వచ్చాయి. అంటే ఇండియన్ కరెన్సీ లెక్కల్లో అక్షరాలా 6 కోట్ల 60 లక్షల రూపాయిలు. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఓపెనింగ్స్ 4 నుండి 5 కోట్ల రూపాయిల మధ్యలో గ్రాస్ వసూళ్లు రాగా, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ ఈ చిత్రానికి 12 కోట్ల 60 లక్షల గ్రాస్ నుండి 13 కోట్ల రూపాయిల గ్రాస్ వరకు రాబట్టింది. షేర్ వసూళ్లు వరల్డ్ వైడ్ గా 5 కోట్ల 50 లక్షల వరకు ఉంటుందని అంచనా. ప్రాంతాల వారీగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి వచ్చిన షేర్ వసూళ్లు ఎంతో ఒకసారి చూద్దాం. ఒక్క నైజాం ప్రాంతం నుండి 1 కోటి 10 లక్షజాలా రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టగా, ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ నుండి 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.

సీడెడ్ ప్రాంతం లో 20 లక్షలు , ఉత్తరాంధ్ర నుండి 24 లక్షలు , గుంటూరు జిల్లా నుండి 10 లక్షలు , ఈస్ట్ గోదావరి నుండి 12 లక్షలు , వెస్ట్ గోదావరి నుండి 6 లక్షలు , నెల్లూరు జిల్లా నుండి 5 లక్షలు, కృష్ణా జిల్లా నుండి 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఈమధ్య కాలం లో కొంతమంది యంగ్ హీరోలకు కూడా ఈ రేంజ్ వసూళ్లు నమోదు అవ్వలేదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓవర్సీస్ ఓపెనింగ్స్ గ్రాస్ ని కూడా ఈ చిత్రం దాటేయడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular