Maa Inti Bangaram 4 days Collections: సమంత ప్రధాన పాత్ర పోషించిన లేటెస్ట్ చిత్రం ‘మా ఇంటి బంగారం’ బాక్స్ ఆఫీస్ వద్ద రాబడుతున్న వసూళ్లు ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. మొదటి వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా దుమ్ము లేపేసిన ఈ చిత్రం, సోమవారం రోజున కూడా మంచి వసూళ్లను రాబట్టి స్ట్రాంగ్ హోల్డ్ ని కనబర్చింది. మొదటి రోజు తో పోలిస్తే , చాలా తక్కువ డ్రాప్స్ ని మాత్రమే సొంతం చేసుకుంది. మొదటి రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 2 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 4 వ రోజున , అనగా సోమవారం రోజున 1 కోటి 77 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ప్రాంతాల వారీగా ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి దాదాపుగా నాలుగు రోజుల్లో 6 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ ప్రాంతాలకు కలిపి 5 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 11 కోట్ల 45 లక్షల రూపాయిలు వచ్చాయి. గ్రాస్ వసూళ్లు దాదాపుగా 22 కోట్ల రూపాయిల వరకు ఉంది. అదే విధంగా తమిళనాడు ప్రాంతం నుండి ఈ చిత్రానికి 1 కోటి 5 లక్షల రూపాయిలు రాగా, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 70 లక్షలు , ఓవర్సీస్ నుండి 7 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 22 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 45 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
విడుదలకు ముందు ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రీకల్ బిజినెస్ కేవలం 12 కోట్ల రూపాయిలు మాత్రమే. ఇప్పటి వరకు ఈ చిత్రానికి 10 కోట్ల 30 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి. అంటే డబుల్ బ్లాక్ బస్టర్ అన్నమాట. వసూళ్లు ఇదే రేంజ్ ఊపులో వెళ్తే మాత్రం ఈ సినిమా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. నిర్మాతగా సమంత కి ఈ చిత్రం ఒక లంకె బిందె లాంటిది. రాబోయే రోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఇంకా ఎన్ని అద్భుతాలను నెలకొల్పబోతుందో చూడాలి.
