https://oktelugu.com/

MAA Elections: ‘మా’ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తన ఓటు వేస్తారా? వేస్తే ఎవరికేస్తారు?

MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. ఇప్పటికే మాటల మంటలు రేపుతున్న ఈ ఎన్నికల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. మంచు , ప్రకాష్ రాజ్ తమ ప్యానెల్స్‌తో పోటీ పడుతున్నారు. మంచు విష్ణుకు నందమూరి బాలకృష్ణ మద్దతుగా ఉండగా.. ప్రకాష్ రాజ్‌కు మెగా క్యాంప్ నుంచి మద్దతు లభిస్తోంది. టాలీవుడ్ లోని ప్రముఖ నటీనటులంతా ప్రస్తుతానికి ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ఉన్నారు. ఆయనకే మద్దతుగా ఉంటున్నారు. ఇక జనసేనానిని పవన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 8, 2021 / 12:30 PM IST
    Follow us on

    MAA Elections: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. ఇప్పటికే మాటల మంటలు రేపుతున్న ఈ ఎన్నికల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. మంచు , ప్రకాష్ రాజ్ తమ ప్యానెల్స్‌తో పోటీ పడుతున్నారు.

    మంచు విష్ణుకు నందమూరి బాలకృష్ణ మద్దతుగా ఉండగా.. ప్రకాష్ రాజ్‌కు మెగా క్యాంప్ నుంచి మద్దతు లభిస్తోంది. టాలీవుడ్ లోని ప్రముఖ నటీనటులంతా ప్రస్తుతానికి ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో ఉన్నారు. ఆయనకే మద్దతుగా ఉంటున్నారు.

    ఇక జనసేనానిని పవన్ కళ్యాణ్ కు బహిరంగంగా ప్రకాష్ రాజ్‌కు తన మద్దతును ప్రకటించారు. ‘రిపబ్లిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రకాష్ రాజ్‌కు మద్దతు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.

    అయితే ‘మా’ ఎన్నికలు జరిగే అక్టోబర్ 10న బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ తన ఓటు వేస్తాడా? ఓటు వేస్తే ఎవరికి వేస్తాడన్నది ఆసక్తిగా మారింది. గతసారి జరిగిన మా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటు వేయలేదు.

    అతను పోలింగ్ రోజున కనిపించకపోతే అది రాజకీయంగా అతనికి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ సమస్యలపై పవన్ ఏకంగా ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అలాంటిది పవన్ ఇప్పుడు ఆ ఎన్నికల్లో ఓటు వేయకపోతే అందరి చేత కార్నర్ అవుతారు. అందుకే ఖచ్చితంగా ఓటు వేసే అవకాశం ఉంది. పవన్ ఈసారి ఎన్నికలను దాటవేయలేని పరిస్థితి.. కాబట్టి, అందరి చూపులు పవన్ కళ్యాణ్ ‘మా’ ఎన్నికల్లో ఓటు వేస్తాడా? లేదా? అన్నది ఆసక్తి రేపుతోంది.