MAA Elections 2021 Live: ‘మా’ ఎన్నికల పోలింగ్ ఈ ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు సినీ తారలు ఒక్కొక్కరిగా పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూళ్లో మా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.

ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకూ ఎన్నికలు జరుగనున్నాయి. 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాలను కూడా ఇదే రోజు ప్రకటించనున్నారు. రాత్రి 8 గంటలలోపు ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.
‘మా’ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం మీడియాతో చిరంజీవి మాట్లాడారు.. నా అంతరాత్మ ప్రభోదానికి అనుసరించి ఓటు వేశానని చెప్పుకొచ్చాడు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని అన్నారు. ఇలాంటివి జరగకూడదని ఎప్పుడూ లేదన్నారు. ఇలాంటి సిట్చువేషన్స్ ని ఎదుర్కోవడానికి సమాయత్తమవ్వాలని సూచించారు. ఓటర్లు మాగ్జిమమ్ ఎవరిని ఎన్నుకుంటే వారికే నా సపోర్ట్ అని స్పష్టం చేశారు.
భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవడానికి మా వంతు ప్రయత్నం మేం చేస్తామని చిరంజీవి తెలిపారు. అవకాశం ఉంటే ఓటు వేయకుండా ఎవరూ ఉండరని చెప్పారు. ఓటు వేయకపోవడం వాళ్ల వ్యక్తిగత విషయం అని.. అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నట్టు తెలిపారు. కొందరు షూటింగ్ బిజీ వల్ల వేయలేకపోవచ్చని.. దాని గురించి ప్రత్యేకంగా తాను మాట్లాడనని తెలిపారు.
ఇక మా ఎన్నికల్లో చిరంజీవితోపాటు బాలక్రిష్ణు, రాంచరణ్, సాయికుమార్ , శ్రీకాంత్, నరేశ్, శివాజీరాజా, ఉత్తేజ్, శివబాలాజీ, సుడిగాలి సుధీర, రాఘవ తదితరులు ఓటు వేసిన వాళ్లలో ఉన్నారు.