Movie Ticket Rates In AP: ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల విషయంలో జగన్ నిర్ణయం పై నాని ఘాటు వ్యాఖ్యలు చేయడం, దాంతో ఏపీ మంత్రులు నానిని ఇష్టం వచ్చినట్టు తిట్లు తిడుతూ ఎగబడ్డారు. అసలు నాని లాంటి చిన్న హీరోకి ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది ? అని మిగిలిన హీరోలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆశ్చర్యం అయితే వ్యక్తం చేశారు గానీ, ఎవరూ ఏపీ ప్రభుత్వం మాట్లాడలేదు.

నాని మాట్లాడాడు అని వైసీపీ నేతలు నాని పై మూకుమ్మడిగా దాడి చేసి నానా మాటలు అన్నారు. అంటే.. సినిమా టిక్కెట్ల వివాదంపై హీరోలు స్పందిస్తే.. వైసీపీ తరహా ఎదురు దాడులు భరించాల్సి వస్తుంది. అందుకే, హీరోలు సైలెంట్ అయిపోయారు. అయితే, గతంలో పవన్ కల్యాణ్ టికెట్ రేట్ల పై స్పందిస్తే.. ఒక్క నాని తప్ప ఏ హీరో మద్దతివ్వలేదు.
Also Read: తెలంగాణలో సినిమా టికెట్ ధరలపై కొత్త జీవో.. కేసీఆర్కు థ్యాంక్స్ చెప్తూ చిరు ట్వీట్
ఇప్పుడు నాని మాట్లాడితే పవన్ కూడా మద్దతు ఇచ్చేలా లేడు. ఇక నానికి ఏ హీరో మద్దతు ఇస్తూ బయటకు వస్తాడు అని అనుకోలేం. కారణం నాని ఒక చిన్న హీరో, సో.. చిన్న హీరో మాట్లాడితే తాము మద్దతుగా ఎందుకు రావాలి ? అని స్టార్ హీరోల భావన అయి ఉండొచ్చు. నిజానికి టిక్కెట్ల వివాదంపై తమిళ హీరో సిద్ధార్థ కూడా స్పందిస్తూ తనదైన శైలిలో విమర్శలు చేశాడు.
సిద్ధార్థ తెలుగు సినిమా పై ప్రేమతో ఆ విమర్శలు చేశాడు. ఇటు నాని, అటు పవన్ ఆవేదనతో విమర్శలు చేశారు. కానీ, స్టార్ హీరోలు ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు మాత్రం ఇంకా సైలెంట్ గానే ఉన్నారు. స్పందించే గుణం వీరిలో లేదా ? లేక జగన్ కి, జగన్ మంత్రులు బొత్స, అనిల్, కన్నబాబు లాంటి వాళ్లకు భయపడుతున్నారా ?
స్టార్ హీరోలంతా అధిక టిక్కెట్ రేట్లతో ప్రజలను దోచుకుంటున్నారని ఒకపక్క ప్రభుత్వమే విమర్శలు చేస్తుంటే.. ఒక్క స్టార్ హీరో కూడా నోరు తెరవలేకపోవడం కచ్చితంగా తెలుగు సినిమా రంగానికే అవమానం. జగన్ కావాలని ఇండస్ట్రీని ఇంత దారుణంగా టార్గెట్ చేస్తుంటే.. హీరోలు వేడుక చూస్తూ ఉండటం కచ్చితంగా తప్పే. సినిమాల్లో హీరోలకు భారీ యాక్షన్ ఇమేజ్‌లు ఉన్నాయి. మరి నిజ జీవితంలో సమాధానం చెప్పే దైర్యం కూడా లేదా ?