Homeఎంటర్టైన్మెంట్Lyricist Kandikonda Passes Away: షాకింగ్ : ప్రముఖ సినీ రచయిత మృతి

Lyricist Kandikonda Passes Away: షాకింగ్ : ప్రముఖ సినీ రచయిత మృతి

Lyricist Kandikonda Passes Away: సినీ గేయ రచయిత కందికొండ గారి మరణం తెలుగు చలన చిత్ర సీమకే కాదు.. తెలుగువారికి కూడా విషాదకరమైన సంఘటనే. సినీ ప్రముఖులు, అభిమానులు కందికొండ పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. కందికొండ గారిని కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున ఆయన సన్నిహితులు తరలివస్తున్నారు. అందరూ కన్నీళ్లతో ఆ అక్షర శిల్పికి అశ్రునివాళి అర్పిస్తున్నారు.

Lyricist Kandikonda Passes Away
Lyricist Kandikonda Passes Away

కందికొండ గారు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఆయన లేకుండా తెలుగు సినిమా పాటలు ఊహించలేం. సాహిత్యం, విలువల గురించి తెలిసిన వ్యక్తి కందికొండ. అలాంటి కవి, సాహితీవేత్త కన్నుమూయడం దురదృష్టకరం. కొన్ని దశాబ్దాలు ఉండి తెలుగు చిత్ర పరిశ్రమకు సేవ చేయాల్సిన వ్యక్తి.. ఇలా సడెన్ కన్నుమూయడం చాలా బాధాకరమైన విషయం.

Also Read:   ‘రాధేశ్యామ్’ నెగిటివ్ టాక్ పై థమన్ సెటైర్లు

కొన్నిసార్లు ఆవేదన, బాధను వ్యక్తపరచడానికి మాటలు రావు అంటారు. అలాంటి మాటలను కందికొండ తన కలంతో అద్భుతంగా వ్యక్తపరిచేవారు. ఆయన రాసిన పాటలు తెలుగుజాతి, భాష బ్రతికున్నంత కాలం చిరస్మరణీయంగా ఉంటాయి. మన హృదయాలను హత్తుకునేలా ఎన్నో పాటలు రాసిన సినీ గేయ రచయిత కందికొండ వయసు 40 సంవత్సరాలు.

Lyricist Kandikonda Passes Away
Lyricist Kandikonda Passes Away

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి నేడు మరింతగా విషమించింది. దాంతో ఆయన నేడు మృతి చెందారు. వెంగళరావు నగర్‌లోని తన ఇంట్లో కందికొండ నేడు తుదిశ్వాస విడిచారు. ‘మళ్లీకూయవే గువ్వ’ పాటతో ఆయన గేయ రచయితగా మారారు. మంచి మెలోడీ గీతంగా ఆ పాట శ్రోతలను విశేషంగా అలరించింది. దీంతో చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలు తలుపుతట్టాయి,

కాగా మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున కందికొండ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

Also Read:  ‘రాధేశ్యామ్’ సెకండ్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

1 COMMENT

  1. […] Radhe Shyam Worldwide Collection: ప్రపంచవ్యాప్తంగా భారీ పాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్’ చిత్రం విడుదలై ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. మరి, భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రాధేశ్యామ్’ అమెరికా బాక్సాఫీస్ నుంచి లేటెస్ట్‌ గా కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. యూఎస్‌లో తొలిరోజు యూఎస్ బాక్సాఫీస్ వద్ద ‘రాధేశ్యామ్’ 11,19,000 డాలర్ల వసూళ్లను సాధించింది. అలాగే రెండో రోజు యూఎస్ బాక్సాఫీస్ వద్ద 08,19,000 డాలర్ల వసూళ్లను సాధించింది […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular