Lucky Bhaskar and Kalki : గత ఏడాది థియేటర్స్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన చిత్రాలలో ఒకటి ‘లక్కీ భాస్కర్’. ‘సీతా రామం’ తర్వాత మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగు లో చేసిన రెండవ చిత్రమిది. విడుదలకు ముందే ట్రైలర్ తో ప్రేక్షకుల్లో ఆసక్తి రేపిన ఈ చిత్రం, విడుదల తర్వాత అంచనాలకు మించి సూపర్ హిట్ అయ్యింది. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఫుల్ రన్ లో 120 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళం లో, మలయాళంలో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమా విడుదలైన రోజే ‘అమరన్’ చిత్రం కూడా విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఆ ప్రభావం దీనిపై కాస్త పడింది.
లేకపోతే 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉన్న చిత్రమిది. మధ్య తరగతి కుటుంబాలకు కనెక్ట్ అయ్యే విధంగా డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ మూవీ స్టోరీ రాసుకున్నాడు. అందుకే ఓటీటీ లో కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 28 వ తారీఖున నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం విడుదలైంది. ఇప్పటికీ కూడా టాప్ 4 స్థానం లో ట్రెండ్ అవుతుంది. అంటే 9 వారాలు ట్రెండ్ అవుతుంది అన్నమాట. ఈ మధ్యలో ఎన్నో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. అయినప్పటికీ కూడా ఈ చిత్రం ట్రెండ్ అవుతూనే ఉందంటే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది మీరే అర్థం చేసుకోండి. ఈ సినిమా విడుదలైన వారానికి ‘అమరన్’ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. కానీ ఆ చిత్రం ఇప్పుడు టాప్ 10 ట్రెండింగ్ నుండి తప్పుకుంది.
కేవలం ఓటీటీ లో మాత్రమే కాదు, టీవీ టెలికాస్ట్ లో కూడా ఈ చిత్రానికి బంపర్ రెస్పాన్స్ వచ్చింది. జనవరి 19 వ తారీఖున ఈ చిత్రం స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అయ్యింది. అదే రోజున జీ తెలుగు లో ప్రభాస్ కల్కి కూడా టెలికాస్ట్ అయ్యింది. కానీ లక్కీ భాస్కర్ కి కల్కి చిత్రం కంటే డబుల్ మార్జిన్ తో టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. లక్కీ భాస్కర్ చిత్రానికి 8.5 టీఆర్ఫీ రేటింగ్స్ రాగా, కల్కి చిత్రానికి కేవలం 4.5 రేటింగ్స్ మాత్రమే వచ్చాయి. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించనిది. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన సినిమాని కూడా ఈ చిత్రం డామినేట్ చేసిందంటే కంటెంట్ పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. నాని నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రానికి కూడా కేవలం నాలుగు టీఆర్ఫీ రేటింగ్స్ మాత్రమే వచ్చాయి. రీసెంట్ గా విడుదలైన అన్ని సూపర్ హిట్ సినిమాలను డామినేట్ చేసింది లక్కీ భాస్కర్.