Lucky Bhaskar Collection: ‘మహానటి’, ‘సీతారామం’, ‘కల్కి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ తో మన తెలుగు ఆడియన్స్ బాగా దగ్గరైన మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. ఈయన సినిమాలు గతంలో తెలుగులో డబ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని తెచ్చుకున్నాయి. నిన్న ఆయన ‘లక్కీ భాస్కర్’ అనే చిత్రంతో మన ముందుకు వచ్చాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ తెరకెక్కించిన ఈ సినిమాకి ప్రీమియర్ షోస్ నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా A సెంటర్స్ లో ఈ సినిమా నిన్న విడుదలైన మిగిలిన మూడు సినిమాల మీద ఈ చిత్రానికే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రాన్ని మలయాళం లో కూడా డబ్ చేసి విడుదల చేసారు. అక్కడ కూడా డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా ఎంత వసూళ్లు వచ్చాయో వివరంగా చూద్దాము.
నిర్మాతలు అందించిన లెక్కల ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు 13 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. అందులో తెలుగు వెర్షన్ నుండి 10 కోట్ల రూపాయిలు కాగా, మలయాళం వెర్షన్ నుండి 3 కోట్ల రూపాయిలు. ‘లక్కీ భాస్కర్’ చిత్రం A సెంటర్స్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకొని తీసిన చిత్రం కాబట్టి, ఈ సినిమా A సెంటర్స్ లో మంచి ఓపెనింగ్ వసూళ్లు వచ్చాయి. కానీ బీ, సి సెంటర్స్ లో మాత్రం యావరేజ్ రేంజ్ లో వచ్చాయి. ఈ వీకెండ్ తర్వాత ఈ సెంటర్స్ లో వసూళ్లు డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిన్న బుక్ మై షో యాప్ లో గంటకి 15 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోగా, నేడు గంటకి 12 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. దీని అర్థం రెండవ రోజు కూడా ఈ సినిమాకి మొదటి రోజు వసూళ్ళలో 80 శాతం వస్తుందని చెప్పొచ్చు.
అలాగే మొదటి రోజు షేర్ లెక్కలు ఎంత వచ్చాయి అనేది చూస్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు కోట్ల రూపాయిల షేర్, కేరళ లో కోటి రూపాయిల షేర్, ఓవర్సీస్+కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మరో రెండు కోట్ల రూపాయిల షేర్, మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం. అయితే ఈ సినిమా పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కు ని అందుకొని, క్లీన్ హిట్ గా నిలబడాలంటే కచ్చితంగా పాతిక కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి, మూడు రోజులకు కలిపి 15 నుండి 18 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఫుల్ రన్ లో కచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.