Shanvi Srivastava: తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ శాన్వి శ్రీ వాత్సవ గురించి ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో ‘లవ్లీ’ సినిమాతో ఈ కన్నడ బ్యూటీ అరంగేట్రం చేసింది. తన అందం, అభినయంతో ప్రేక్షకుల మదితో తనదైన ముద్ర వేసుకుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
సొగసైన అందాలు, క్యూట్ లుక్స్ తో తెలుగు కుర్రకారు గుండెలను శాన్వి మెల్ట్ చేసేశారు. దీంతో మొదటి సినిమా అయిన ‘లవ్లీ’ తో విజయాన్ని అందుకున్న ముద్దుగుమ్మ శాన్వి ఆ తరువాత సుశాంత్ హీరోగా నటించిన అడ్డా సినిమాలో హీరోయిన్ గా నటించారు. లవ్లీ లుక్స్ తో కనిపించే ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ గాల్ గా కనిపించిందని చెప్పుకోవచ్చు. ఆ తరువాత మంచు విష్ణు చిత్రంలోనూ నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆర్టీవీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో గ్లామర్ డోసు పెంచింది. అయితే అనుకున్నంతగా ఆ సినిమా విజయాన్ని సాధించలేకపోయింది. కానీ ఆ తరువాత తెలుగు చిత్ర పరిశ్రమకు శాన్వి దూరంగా ఉన్నారు.
కన్నడ పరిశ్రమలో సినిమాలు చేస్తున్న శాన్వి మధ్యలో బహుభాషా చిత్రంగా వచ్చిన శ్రీమన్నారాయణలో నటించారు. ప్రస్తుతం అందాల తార శాన్వి కన్నడ సినీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారని తెలుస్తోంది. అంతేకాదు మంచి విజయాలను అందుకుంటూ కన్నడ స్టార్ హీరోల సరసన నటించి కన్నడ అభిమానుల్లో ముద్ర వేసుకున్నారు.
View this post on Instagram
సినిమాల్లో ఓ వైపు బిజీగా ఉంటూనే మరో వైపు సోషల్ మీడియాలోనూ శాన్వి ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంటారు. ఎప్పటికప్పుడు ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది ఈ అమ్మడు. ఇన్ స్టా వేదికగా ఎప్పుడూ ఫోటో షూట్లను షేర్ చేస్తూ ఉంటారు. చిన్న చిన్న డ్రెస్సుల్లో కుర్రకారు మతులు చెడగొడుతుంటారు. ఈ క్రమంలోనే తన అందమైన పిక్స్ ను మరోసారి ఫ్యాన్స్ తో కన్నడ భామ షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం శాన్వికి సంబంధించిన కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వైట్ డిజైనర్ లుక్ లో కనిపిస్తున్న శాన్విని చూసి నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు. ఇది వరకు ఎప్పుడు లేనంతగా శాన్విలో కొత్త అందం కనిపిస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
View this post on Instagram