Love Story: ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ” ఆహా ” ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తూ అందరి మన్ననలను పొందుతుంది. వెబ్ సిరీస్ లు , షో లు , పలు సినిమాలతో అలరిస్తున్న ఆహా … త్వరలోనే మరో బ్లాక్ బస్టర్ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ” లవ్ స్టోరీ ” సినిమా విడుదలై … భారీ విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో … నటీనటుల పర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచింది.
ఇరు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ తో ఈ మూవీ ఆడియెన్స్ ను అలరిస్తుండగా … త్వరలోనే డిజిటల్ ప్రీమియర్ గా ఆహా లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 24 వ తేదీన విడుదలైన లవ్ స్టోరీ చిత్రం … ఇప్పటికే ముప్పై రెండు కోట్ల షేర్ సాధించి లాభాల బాటలో పయనిస్తోందని చిత్రా యూనిట్ ప్రకటించింది. ఈ నేపధ్యంలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని నిర్మాతలు భావిస్తున్నట్లు అర్దం అవుతుంది.
ఈ మేరకు ఈ మూవీ ఓటీటీ హక్కులను భారీ మొత్తంలో ఆహాకు అమ్మేసినట్లుగా కధనాలు వినిపిస్తున్నాయి. కాగా అక్టోబర్ 22న ఆహాలో లవ్ స్టోరీ చిత్రం అందుబాటులోకి రానుందని సినీ వర్గాల్లో అనుకుంటున్నారు. అయితే ఈ విషయంలో ఆహా సంస్థ ప్రతినిధులు కానీ… లవ్ స్టోరీ నిర్మాతల నుంచి కానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతుండడంతో … ధియేటర్లకు రాలేకపోతున్న ప్రేక్షకులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Love story movie going to release in aha
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com