
సున్నితమైన అంశాలతో , సునిశిత కథలతో సినిమాలు తీసే డైరెక్టర్ శేఖర్ కమ్ముల. “ఆనంద్ , గోదావరి , హ్యాపీ డేస్ , ఫిదా ” లాంటి ఘన విజయాల తరువాత ఇపుడు నాగ చైతన్య హీరోగా ఒక సినిమా చేయడం జరుగుతోంది ….ఫిదా లాంటి సూపర్ హిట్ సినిమా తరవాత చేస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. నైజాంలో ప్రముఖ పంపిణీదారులుగా ఉంటూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగం లోకి అడుగు పెడుతోంది. ఆ క్రమం లో నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రం తో నిర్మాతలుగా మారుతున్నారు .
అచ్చ తెలుగు సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల , అక్కినేని నాగచైతన్య – ఫిదా బ్యూటీ సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా ‘లవ్ స్టోరీ’ అనే సినిమా రూపొందించడం జరుగుతోంది. కాగా ఈ చిత్రం నాగ చైతన్య కెరీర్ లో వసూళ్ళ పరంగా కొత్త ఫిగర్స్ నమోదు చేయడం ఖాయం లా కనిపిస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అండ్ ఓవర్సీస్ హక్కులు నాగ చైతన్య గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది. శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ యు ఎస్ లో భారీ బ్లాక్ బస్టర్ అయిన నేపధ్యం లో ఓవర్సీస్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.