Ram Gopal Varma: మన టాలీవుడ్ నుండి దేశం గర్వించదగ్గ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచి, ఆ తర్వాత బూతు సినిమాలు తీసుకునే స్థాయికి దిగజారిపోయిన డైరెక్టర్ ఎవరు అంటే మన అందరికి టక్కుమని గుర్తుకు వచ్చే పేరు రామ్ గోపాల్ వర్మ..ఇతను దర్శకత్వం అనేది ఎప్పుడో మర్చిపోయాడు..కాంట్రవర్సీల మీదనే కాలం గడిపేస్తున్నాడు..ఇతనిని అభిమానించే వారు సైతం ఏమిటి ఈయన ఇలా అయిపోయాడు అని బాధపడే స్థాయికి వచేసాడు..కొద్దీ రోజుల క్రితమే ఆయన లెస్బియన్ లవ్ స్టోరీ గా ‘డేంజరస్(మా ఇష్టం )’ అనే సినిమాని తీసాడు.

నైనా గంగూలీ మరియు అప్సర రాణి ఈ చిత్రం లో జంటగా నటించారు..వీళ్లిద్దరు రొమాన్స్ చేసుకునే వీడియో సాంగ్స్ యూట్యూబ్ లో ఇప్పటికి అందుబాటులోనే ఉన్నాయి..ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ సినిమాని కోర్టు లో కేసు వెయ్యడం వల్ల ఆపేసారు..ఇప్పుడు ఈ సినిమా విడుదలకు కోర్టు పచ్చ జెండా ఊపేసింది..ఈ నెల 9 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసాడు..ఈ మీడియా సమావేశం లో ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన స్టైల్ లోనే తలతిక్కగా సమాదానాలు చెప్పాడు..ఒక విలేకరి ‘ఈ సినిమా మన సంస్కృతికి విరుద్ధం గా ఉందని..ఈ సినిమాని ఆపేయాలని కొన్ని సంఘాలు ధర్నాలు చేసాయి కదా..దీనికి మీరు ఏమని సమాధానమిస్తారు’ అని అడగగా రామ్ గోపాల్ వర్మ దానికి సమాధానం ఇస్తూ ‘ఇక్కడకి వచ్చిన మీడియా ప్రతినిధులతో అమ్మాయిలు చాలా మంది ఉన్నారు కదా..మీరే ఈ సినిమాని చూసి ఎలా ఉందొ చెప్పండి..కచ్చితంగా మీరు ఇష్టపడుతారు..ఈ సినిమా నుండే అమ్మాయిలు లెస్బియన్ సినిమాలకు కనెక్ట్ అవ్వడం ప్రారంభిస్తారు’ అంటూ సమాధానం ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ.

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే మొట్టమొదటి లెస్బియన్ ప్రేమ కథా చిత్రం ఇది..ఈ చిత్రం విడుదల ఆపాలనుకున్న వాళ్ళు కూడా ఈ సినిమాని చూస్తే నన్ను సపోర్ట్ చేస్తారు అంటూ రామ్ గోపాల్ వర్మ చేసినా కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.