Aishwarya Rajinikanth: తమిళ హీరో ధనుష్, సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించి.. ఇప్పటికే నెల రోజులు కావస్తోంది. అయితే, రజినీకాంత్ వీరి విడాకుల విషయంలో చాలా బాధ పడ్డాడు అని, రజిని బాధను చూడలేక, ధనుష్, ఐశ్వర్య దంపతులు మళ్లీ కలిసిపోతున్నారు అని వార్తలు వినిపించాయి. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది.

తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని ఐశ్వర్య తేల్చి చెప్పింది. నిజానికి రజినీకాంత్ ఇద్దరినీ కలిపేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. కానీ, ఐశ్వర్య అసలు కాంప్రమైజ్ కాలేదు అట. దాంతో కూతురు ఇష్టప్రకారం తీసుకున్న నిర్ణయానికే రజినీకాంత్ కూడా కట్టుబట్టాడు అని తెలుస్తోంది. దాంతో రజినీకాంత్ కూడా ఈ విడాకుల మేటర్ ని వదిలేశాడట.
Also Read: అలీకి జగన్ ఇవ్వబోతున్న పదవి అదేనట ?
అయితే, ఐశ్వర్య వాలెంటైన్స్ డే సందర్భంగా పెట్టిన ఒక మెసేజ్ కూడా బాగా వైరల్ అవుతుంది. ఆ మెసేజ్ లో ఆమె తన విడాకులకు సంబంధించిన విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చింది. ఆమె ధనుష్ తో ప్రేమ గురించి నర్మగర్భంగా మాట్లాడుతూ.. ‘ప్రేమ అనేది ఒక వ్యక్తితోనే ఎప్పటికీ ముడిపడదు. నేను మా నాన్నను ప్రేమిస్తాను. మా అమ్మని ప్రేమిస్తాను. నా ఇద్దరు కొడుకులని ప్రేమిస్తాను. అవును, ప్రేమ అనేది వయసుతో పాటు, మన పరిణితి చెందడం బట్టి కూడా మారుతూ ఉంటుంది’ అని ఆమె మెసేజ్ పెట్టింది.

ఈ మెసేజ్ ను కేవలం ఆమె ధనుష్ ను ఉద్దేశించే పెట్టింది అని అర్ధం అవుతుంది. ధనుష్‌తో ఐశ్వర్యకు 2004 నవంబర్ 18న వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మధ్య వీరి మధ్యలోకి వేరే వ్యక్తులు వచ్చారని.. ధనుష్ వేరే హీరోయిన్ తో సన్నిహితంగా ఉండటం ఐశ్వర్యకి నచ్చలేదని అందుకే అప్పటి నుంచి ఆమె ధనుష్ కి దూరంగా ఉంటుందని తెలుస్తోంది.
కాగా రజినీకాంత్ మళ్ళీ సినిమాలతో బిజీ కానున్నారు. ఇప్పటికే కొత్త సినిమా ప్రకటించారు. అన్నట్టు ఐశ్వర్య ఇక తన తండ్రి సినిమాలలో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అలాగే ఆమె తన దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా ఒక సినిమాను ప్లాన్ చేస్తోంది. ఈ సినిమా గురించి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
Also Read: ఆ బిజినెస్ మెన్ తో తమన్నా పెళ్లి !
[…] […]