Fake Collection Posters: స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే చాలు రికార్డుల కలెక్షన్స్ కొల్లగొడుతూ ముందుకు సాగుతుంటాయి. ప్రేక్షకులు సైతం ఆ సినిమాని ఒకటికి రెండుసార్లు చూడడానికి ఇష్టపడుతుంటారు. స్క్రీన్ మీద స్టార్ హీరో కనిపించిన ప్రతిసారి విజిల్స్ కొడుతూ ఆ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తుంటారు. కలెక్షన్స్ ని పెంచడానికి అభిమానులైతే రిపిటెడ్ గా సినిమాని చూస్తూ ఇతర హీరోల కలెక్షన్స్ కంటే మన హీరో కలెక్షన్స్ టాప్ లో ఉండాలనే ప్రయత్నం చేస్తుంటారు… ఇక హీరోలను సాటిస్ఫై చేయడానికి ప్రొడ్యూసర్స్ సైతం మా సినిమా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టిందంటూ పోస్టర్స్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. వాటిలో చాలావరకు ఫేక్ కలెక్షన్స్ ఉంటాయంటూ రీసెంట్ గా నిర్మాత అనిల్ సుంకర సైతం క్లారిటీ ఇచ్చాడు.
ఇక ఏది ఏమైనా కూడా అటు అభిమానులను ఉత్సాహపరచడానికి హీరోలు తమ సినిమాల కలెక్షన్స్ భారీగా చెప్పుకోడానికి మాత్రమే అవి పని చేస్తాయి అనేది వాస్తవం…మరి ఫేక్ కలెక్షన్స్ పోస్టర్స్ వేయడం వల్ల సినిమాకి కొంతవరకు నష్టమైతే జరుగుతుంది. సినిమా భారీ కలెక్షన్స్ కొల్లగొడుతుంది అంటూ చాలామంది అభిమానులు రిపిటెడ్ గా ఆ సినిమాను చూడటం మానేస్తున్నారు.
మా అభిమాన హీరో భారీ రేంజ్ కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు అంటే సోషల్ మీడియాలో ఒక న్యూస్ ని సర్క్యులేట్ చేస్తుంటారు. ఇక ప్రొడ్యూసర్స్ ఇంటి మీద ఐటీ రైడ్స్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఏది ఏమైనా కూడా సినిమా సక్సెస్ ఫుల్ గా నిలువడానికి ప్రొడ్యూసర్స్ డిఫరెంట్ స్ట్రాటజీలను వాడుతుంటారు.
ఇక అలాగే హీరోల ఇమేజ్ కూడా తగ్గకూడదనే ఉద్దేశ్యంతో ఈ ఫేక్ పోస్టర్స్ ని వేస్తూ ప్రొడ్యూసర్స్ తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు…ఇక ఇప్పటికైనా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయపోతే మంచిది అని చాలా మంది సినిమా మేధావులు చెబుతున్నారు…ఇక వీటి వల్ల ఫ్యాన్ వార్స్ జరగడానికి కూడా అవకాశం ఉంది…
