Childhood Photo: కమల్ హాసన్ తో హిట్టు సినిమాలో నటించిన ఈ పాప ఎలా ఉందో చూడండి..

1996లో కేఎస్ రవికుమార్ డైరెక్షన్లో ‘అవ్వాయ్ షణ్ముగి’ అనే తమిళ మూవీ రిలీజ్ అయింది. అప్పటి వరకు కమలాసన్ ను లవ్, యాక్షన్ హీరోగా మాత్రమే చూశారు. కానీ అప్పటి నుంచి ప్రయోగాత్మక చిత్రాలు తీసే కమల్ కనిపించాడు.

Written By: Chai Muchhata, Updated On : July 29, 2023 5:47 pm

Childhood Photo

Follow us on

Childhood Photo: సౌత్ స్టార్ కమలాసన్ సినిమాలంటే చాలా మంది లైక్ చేస్తారు. విలక్షణ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. మిగతా హీరోల కంటే కమలాసన్ కు పాన్ ఇండియాలో ఫ్యాన్స్ ఉన్నారు. 1980 నుంచి నేటి వరకు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమలాసన్ ఎన్నో విభిన్న చిత్రాలు చేశారు. ఆయన నటించిన కామెడీ మూవీ ‘భామనే సత్యభామనే’. ఈ సినిమాలో కమల్ తో పాటు మీనా హీరోయిన్ గా నటించింది. ఇందులో ఓ పాప కోసం ముసలావిడ వేషంలో పాప కోసం ఆ ఇంటికి వెళ్తాడు. ఆ తరువాత జరిగిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే ఈ పాప ఇప్పుడు హీరోయిన్ లెవల్లో మారిపోయింది. ఆమె ఇప్పుుడు ఎలా ఉందో చూడండి..

1996లో కేఎస్ రవికుమార్ డైరెక్షన్లో ‘అవ్వాయ్ షణ్ముగి’ అనే తమిళ మూవీ రిలీజ్ అయింది. అప్పటి వరకు కమలాసన్ ను లవ్, యాక్షన్ హీరోగా మాత్రమే చూశారు. కానీ అప్పటి నుంచి ప్రయోగాత్మక చిత్రాలు తీసే కమల్ కనిపించాడు. ఈ సినిమాను తెలుగులో ‘భామనే సత్యభామనే’ పేరుతో రిలీజ్ చేశారు. ఈ మూవీ తమిళంలోనే కాకుండా తెలుగు, హిందీలో కూడా రిలీజ్ చేయడంతో అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇందులో ప్రతీ పాత్ర కీలకమనే చెప్పొచ్చు.

ఇందులో నటించిన చిన్న పాప పేరు ఆన్ అన్నా. తల్లిదండ్రులు విడిపోయిన తరువాత ఓ అమ్మాయి ఎలా బాధపడుతుందనే క్యారెక్టర్ లో ఆమె నటించారు. అమాయకమైన కళ్లతో అప్పుడే అలరించారు. తండ్రి మారు వేషంలో ఉన్నా కూతురు గుర్తుపడుతుంది.. అని తన పాత్రలో రివీల్ చేసిన తనను చాలా ఆనందించారు. అయితే ఆన్ అన్నా ఈ సినిమాకు అవార్డును కూడా తెచ్చుకున్నారు. ఈ సినిమా తరువాత హిందీలో ‘హెరా ఫెరి’ అనే సినిమాలో మాత్రమే నటించింది. ఆ తరువాత చదువుపై ఫోకస్ పెట్టింది.

ఆన్ అన్నా సినిమాలకు దూరంగా ఉన్నా ఎంటర్ ప్రెన్యూర్ గా రాణిస్తుందని తెలుస్తోంది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈమె చిన్నప్పడు కమలాసన్ తో కలిసి ‘భామనే సత్యభామనే’ అనే సినిమాలో నటించిన అమ్మాయి అని ఆమె చెప్పే వరకు ఎవరూ గుర్తుపట్టలేదు. తన చిన్న నాటి సంగతులు గుర్తు చేసుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఆమెకు సంబంధించిన లేటేస్ట్ ఫొటోలు చూసి హీరోయిన్ గా రాణించే అవకాశాలున్నాయని చాలా మంది అంటున్నారు.