World Largest SUV: ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడంతా Sports Utiligy Vehicles (SUV)లతే హవా సాగుతోంది. కార్ల వినియోగదారులు సైతం ఎస్ యూవీలపై ఇంట్రస్ట్ పెట్టడంతో కంపెనీలు వాటివైపే చూస్తున్నాయి. ఇన్నాళ్లు ఎస్ యూవీ అనగానే హ్యాచ్ బ్యాక్ వెహికిల్స్ కంటే కాస్త ఎక్కువ ఎత్తులో ఉండి కనీసం 5 గురికి సౌకర్యవంతంగా ఉండేది. కానీ ఇప్పుుడు ఊహించని ఎత్తులో ఓ ఎస్ యూవీ ని తయారు చేశారు. ఏకంగా 14 మీటర్ల పొడవు ఉండే వాహనాన్ని దుబాయ్ ఎమిరేట్స్ కంపెనీ తయారు చేసింది. దీనికి హమ్మర్ H1 పేరు పెట్టి ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో గురించిన వివరాల్లోకి వెళ్తే..
సాధారణంగా హమ్మర్ SUV అమెరికా సైన్యంలో మాత్రమే వినియోగించారు. ఆర్మీ సిబ్బందిని ఒకచోటు నుంచి మరో చోటు కు తీసుకెళ్లడానికి దీనిని అధికారికంగా వినియోగించేవారు. ఆ తరువాత వివిధ రూపాల్లో హమ్మర్ మోడల్స్ బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు సివిలియన్ వెర్షన్ ను కొత్తగా ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన H1 ను యూఏఈ ఆవిష్కరించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద H1 గా తెలుస్తోంది. Iamautomovivecrazer అనే సోషల్ మీడియా ఖాతాలో H1 సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు.
ఈ హమ్మర్ ను H1 X3గా కూడా పిలుస్తారు. ఇది ప్రామాణిక H1 SUV కంటే మూడు రేట్లు పెద్దది. యూఏఈ ఆల్ మేడమ్ ఆఫ్ -రోడ్ హిస్టరీ మ్యూజియంలో దీనిని ప్రదర్శించారు. హమ్మర్ 6.6 మీటర్ల ఎత్తు, 14 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పుతో కలిగి ఉంది. ఈ హమ్మర్ కేవలం ప్రదర్శనకు మాత్రమే కాకుండా అసాధారణమైనదిగా భావిస్తున్నారు. ఎమిరేట్స్ కు చెందిన షేక్ హమద్ బిన్ హమ్దాన్ అనే వ్యక్తి కార్ల సేకరణ అంటే చాలా ఇష్టం. అతని గ్యారేజీలో ఇప్పటికే చాలా కార్లు ఉన్నాయి. ఇతని వద్ద ఉన్న డబ్బుతో కార్లపైనే ఎక్కువగా వెచ్చిస్తారు. తాజాగా SUV హమ్మర్ ఇతని యాజమాన్యంలోనే ఉంది.
ఈ వీడియోను చూసిన చాలా మంది కార్ల ప్రేమికులు ఆశ్చర్యపోతున్నారు. ఇటువంటి వెహికిల్ ను ఇప్పటి వరకు చూడలేదని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిని ఎందుకోసం ఉపయోగిస్తారోనన్న విషయం బయటపెట్టలేదు. దీనిని కేవలం షో కోసమే బిన్ తయారు చేయించాడా? లేక మిలటరీకి అప్పగిస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. ఏదీ ఏమైనా ప్రపంచంలో ప్రస్తుతం అతిపెద్ద ఎస్ యూవీ ఇదేనని చాలా మంది కొనియాడుతున్నారు.