Anchor Suma: గ్లామర్ ఫీల్డ్ లో అందమే పెట్టుబడి. హీరోలు, హీరోయిన్స్, నటులు, యాంకర్స్ దాని కోసం పరితపిస్తారు. వయసు పెరుగుతున్నా, జుట్టు ఊడుతున్నా, పొట్ట వస్తున్నా బాగా దిగాలు పడిపోతారు. అందుకే సాధ్యమైనంత వరకు అందం కోల్పోకుండా జాగ్రత్తలు పడతారు. వ్యాయామం చేస్తారు. డైటింగ్ ఫాలో అవుతారు. యోగాసనాలు వేస్తారు. మెడిటేషన్ చేస్తారు. సెలెబ్రిటీలు నచ్చింది తినలేరు. పాపం రోజూ కడుపు మాడ్చుకుంటారు. ఐదు పదుల వయసు దగ్గర పడుతున్న స్టార్ యాంకర్ సుమ పరిస్థితి మరింత దారుణం.
సుమ షేర్ చేసిన వీడియో చూసిన ఫ్యాన్స్ ఎంత సంపాదించి ఏం లాభం అని ఎద్దేవా చేస్తున్నారు. సదరు వీడియోలో సుమను స్వీట్స్ నోరూరిస్తుంటే, వాటిని పక్కన పెట్టి పచ్చి కూరగాయలు తింటుంది. స్వీట్స్ తినాలని ఉన్నా తినలేను. వెయిట్ తగ్గాలంటే తప్పదన్న అర్థంలో ఆ వీడియో పోస్ట్ చేసింది. వీడియోలో వెయిట్ తగ్గించే టిప్స్ అని కామెంట్ జోడించింది. సుమ వీడియో చూసిన జనాలు, ఎంత సంపాదించి ఏం లాభం మేడం, నచ్చింది తినే అదృష్టం లేదని సెటైర్స్ వేస్తున్నారు.
బుల్లితెరపై సుమ హవా రెండు దశాబ్దాలుగా సాగుతుంది. ఆమె తిరుగులేని యాంకర్ గా ఉన్నారు. చెప్పాలంటే జీవితం యాంకరింగ్ కి అంకితం చేశారు. నమ్మరు కానీ సుమ ఆస్తి వందల కోట్లని సమాచారం. ఆమెకు హైదరాబాద్ లో లగ్జరీ హౌస్ ఉంది. అక్కడ షూటింగ్స్ కూడా జరుగుతాయట. ఫేమ్, నేమ్, మనీ సంపాదించినప్పటికీ రిటైర్ కాలేదు. అందుకే బరువు పెరగకుండా డైటింగ్ చేస్తుంది.
ఆ మధ్య సుమ రిటైర్మెంట్ తీసుకున్నారంటూ ప్రచారం జరిగింది. ఇకపై ఆమె యాంకరింగ్ చేయరని కథనాలు వెలువడ్డాయి. ఆ సూచనలు కనిపించడం లేదు. సుమ అడ్డా పేరుతో ఒక షో చేస్తున్నారు. ఇటీవల మరో షో స్టార్ట్ చేసినట్లు సమాచారం. సంపాదన సంగతి పక్కన పెడితే… సుమకు యాంకరింగ్ వృత్తి అలవాటైపోయింది. కూర్చొని తిన్నా తరగని ఆస్తులు ఉన్నా… ఇష్టంతో యాంకరింగ్ కొనసాగిస్తున్నారు. త్వరలో సుమ కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం. సుమ ఆ ఏర్పాట్లలో ఉన్నారట.
View this post on Instagram