OTT Platforms: కరోనా మూడో వేవ్ కారణంగా సినిమాల విడుదల వాయిదాలు పడుతున్నాయి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ విడుదల వాయిదా పడింది. ‘రాధేశ్యామ్’ది కూడా అదే బాట అని టాక్. మరో పక్క రానున్న రోజుల్లో కోవిడ్ కేసులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఆ పెరుగుదల పరిస్థితి వస్తే ఇక సినిమాల రిలీజ్ లు ఉండవు. అసలుకే ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ పై సీరియస్ గా ఉంది కాబట్టి.. కచ్చితంగా థియేటర్లను క్లోజ్ చేస్తోంది.

అప్పుడు చిన్న సినిమాలు కూడా రిలీజ్ ను పోస్ట్ ఫోన్ చేసుకోవాలి. అందుకే, మళ్ళీ అందరి చూపు ఓటీటీల వైఫు వెళ్ళింది. ప్రస్తుతం నిర్మాణ సంస్థలు తమ సినిమాలను ఓటీటీ వేదికల పై విడుదల చేయడానికి రెడీ అవుతున్నాయి. ఎలాగూ థియేటర్ లలో విడుదల చేయడం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. ఒక విధంగా చిన్న సినిమాలకు ఓటీటీ సంస్థలే బెటర్.
Also Read: రెమ్యునరేషన్ విషయంలో నో కాంప్రమైజ్ !
ఎందుకంటే.. చిన్న తరహా సినిమా వాళ్ళకు లాభం అనుకున్న ధరకే ఓటీటీ మరియు శాటిలైట్ రైట్స్ దక్కుతాయి. పైగా రిస్క్ లేదు. గతంలో కూడా మిడిల్ క్లాస్ మెలోడీస్, ఒక పిట్ట కథ, సర్, లిఫ్ట్ బాయ్, లుడో లాంటి కొన్ని చిన్న తరహా చిత్రాలు ఓటీటీలో మంచి విజయాలు సాధించాయి. అదే ఇవి గనుక థియేటర్ కి వెళ్తే కచ్చితంగా ప్లాప్ అయేవి.
అసలు థియేటర్స్ లో అయితే తిరిగి డబ్బులు వస్తాయా ? రావా ? అనే టెన్షన్ డబ్బులు చేతికి వచ్చే వరకూ ఉంటుంది. కానీ ఓటీటీలో సినిమా రిలీజ్ చేస్తే.. ఖచ్చితంగా మంచి డబ్బు వస్తుంది. నిర్మాతలకు రిస్క్ ఉండదు. పైగా థియేటర్ల కోసం ఎదురు డబ్బులు కట్టాల్సిన దుస్థితి నిర్మాతలకు ఉండదు.
అలాగే ఓటీటీలలో సినిమా రిలీజ్ అయితే, ప్రమోషన్స్ పేరుతో మోసపోయే అవకాశం కూడా చాలా తక్కువ. ఏ రకంగా చూసుకున్నా చిన్న సినిమాలకు ఓటీటీలే బెస్ట్ ఆప్షన్.
Also Read: అప్పటి ముచ్చట్లు : ఎన్టీఆర్ ‘కర్ణ’కి 15 రెట్లు లాభాలు.. నేటికీ ఇది గొప్ప రికార్డే !